»   » 'ఆర్య 2' కూడా బ్లూరే డిస్క్ లలో...

'ఆర్య 2' కూడా బ్లూరే డిస్క్ లలో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్, కాజల్ కాంబినేషన్ లో సుకుమార్ రూపొందించిన 'ఆర్య 2' చిత్రం డీవీడిలు కూడా బ్లూ రే డిస్క్‌లు గా త్వరలో మార్కెట్లో లభించనున్నాయి. ఈ విషయాన్ని 'ఓల్గా' ప్రసాద్‌ మీడియాకు తెలియచేసారు. తాజాగా వారు ఈ చిత్రం డీవీడీ, వీసీడీలను హెదరాబాద్‌లో విడుదల చేసారు. ఈ సందర్భంగా ఓల్గా ప్రసాద్‌ మాట్లాడుతూ - "సూపర్‌ హిట్‌ అయిన 'ఆర్య-2' సినిమా సీడీ, డీవీడీలను విడుదల చేయడం ఆనందంగా ఉంది. మార్కెట్లో పైరసీ తాకిడి ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరకే వీటిని అందిస్తున్నాం అన్నారు. అలాగే ఇప్పటివరకు ఎన్టీఆర్‌, చిరంజీవి, నాగార్జున..ఇలా అందరు అగ్రహీరోలు, రామానాయుడు, కె.ఎల్‌.నారాయణలాంటి అగ్ర నిర్మాతలు అందించిన సినిమాలను విడుదల చేశాం. పైరసీ సీడీల్లో కాకుండా నాణ్యత గల సీడీల్లో సినిమాని చూస్తేనే ప్రేక్షకులు ఆ థ్రిల్‌ని ఎంజాయ్‌ చేయవచ్చు. ఇక 'ఆర్య-2' విడుదలైన వంద రోజుల లోపే ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఇచ్చినందుకు ఆదిత్యబాబు, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ లకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక 'ఓల్గా' ప్రసాద్‌ ఇటీవలే 'అరుంధతి' బ్లూరే డిస్క్‌లను విడుదల చేసి సక్సెస్ చేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu