»   » అనుష్క కొత్త చిత్రం 'వర్ణ' రిలీజ్ ఎప్పుడంటే...

అనుష్క కొత్త చిత్రం 'వర్ణ' రిలీజ్ ఎప్పుడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ఆడువారి మాటలకి అర్దాలే వేరులే చిత్రంతో తెలుగువారికి పరిచయమైన శ్రీరాఘవ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'వర్ణ'. ఆర్య, అనుష్క జంటగా నటించారు. ఈ చిత్రాన్ని పి.వి.పి. సినిమా పతాకంపై పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఆగస్టులో తెరపైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేసిన ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కీలకమైనది. ఆ పాత్రకు అనుష్క ప్రాణంపోసింది. ఆమె పై వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ... ''జార్జియా దేశంలో తెరకెక్కించిన సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అక్కడ 18వ శతాబ్దంనాటి భవంతిలో చిత్రించిన దృశ్యాలు కీలకమైనవి''అని తెలిపాయి.

గతంలో 'అరుంధతి' చిత్రంలో కత్తి పట్టిన అనుష్క....వర్ణ చిత్రంలో కత్తి పోరాటాలు చేస్తూ సాహస యువతిగా కనిపించనుంది. ఈ పోస్టర్లు చూస్తుంటే సినిమా విభిన్నంగా, సరికొత్తగా ఉంటుందని స్పష్టం అవుతోంది. గతంలో 'యుగానికి ఒక్కడు' లాంటి విభిన్నమైన సినిమాలు తెరకెక్కించిన సెల్వరాఘవన్ ఈ సినిమానే ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తోంది. ఒక పాత్రలో ఆమె సాధారణ గృహిణిగా, ఒక పాత్రలో ట్రైబల్ ఉమన్(ఆటవిక యువతి)గా కనిపించనుంది. జార్జియా అడవుల్లో అనుష్కపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో పోషిస్తోన్న విలక్షణమైన పాత్ర కోసమే అనుష్క మార్షల్ ఆర్ట్స్ ని సైతం నేర్చుకుంది. అరుంధతి తర్వాత అనుష్కకు ఈచిత్రం బాగా పేరు తెస్తుందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రామ్‌జీ, సంగీతం: హారిస్‌ జైరాజ్‌.

English summary

 Arya and Anushka have paired up for a film, which is being directed by Sri Raghava. 'Varna' is the title of the film. Param V Potluri, the producer of 'Balupu', is producing this movie on PVP Cinema banner. Anushka's role is going to be very important in this movie, and visual effects are given prior importance. The makers are planning to release the movie in August.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more