»   » "కదంబన్" టీజరే ఇరగదీసాడనుకుంటే ఇప్పుడు పాట కూడా (వీడియో )

"కదంబన్" టీజరే ఇరగదీసాడనుకుంటే ఇప్పుడు పాట కూడా (వీడియో )

Posted By:
Subscribe to Filmibeat Telugu

కదంబన్.. ఆర్య హీరోగా నటిస్తున్న ఈ మూవీపై కోలీవుడ్ అంతా ఆసక్తిగా ఉంది. దాదాపు టార్జాన్ కి దగ్గరగా ఉండే రోల్ కోసం.. ఆర్య బోలెడంత కష్టపడుతూ ఈ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ టీజర్‌ ఇటీవల విడుదలైంది. యాక్షన్ అండ్ అడ్వెంచర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆర్య నటన హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. కదంబన్ సినిమాను ప్రముఖ నిర్మాత ఆర్‌బి చౌదరి నిర్మిస్తున్నారు. ఆర్య సరసన కేథరిన్ థెస్రా నటిస్తుంది. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు.

అడ్వెంచర్‌ జానర్

అడ్వెంచర్‌ జానర్

ఆర్ బి చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్ థెస్రా కథానాయికగా నటిస్తోంది. యాక్షన్‌, అడ్వెంచర్‌ జానర్ లో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తుంది. రీసెంట్ ఈ చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్ విడుదల చేసింది టీం. ఇందులో కేథరిన్ చాలా గ్లామర్ గా కనిపించింది తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల ద్వారా కేథరిన్ ఎంతో క్రేజ్ సంపాదించుకుంది.

కేథరిన్ ట్రైబల్ గర్ల్

కేథరిన్ ట్రైబల్ గర్ల్

ఈ భాషలన్నింటిలోనూ గ్లామర్ పరంగా ఆమె పూర్తి మార్కులు సాధించుకోవడం విశేషం. కంటిచూపుతోనే కట్టిపడేయడం కేథరిన్ ప్రత్యేకత అని ఆమె అభిమానులు చెబుతుంటారు. ఈ చిత్రంలో ఆర్య టార్జాన్ గా కనిపించనుండగా, కేథరిన్ ట్రైబల్ గర్ల్ పాత్ర పోషించింది. ఇక కదంబన్ కోసం ఆర్య బాగా కష్టపడ్డాడని మనకీ టీజర్ ఫస్ట్ లుక్ లతో అర్దం అవుతోంది.

దట్టమైన అడవుల్లో

దట్టమైన అడవుల్లో

బాగా కండలు పెంచేసి.. తన రూపంలో చాలానే మార్పులను తీసుకొచ్చాడు. గిరిజనుడి పాత్ర కోసం అన్ని రకాలుగాను.. తన శరీరంలో మార్పులు చూపించాడు. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువగా కొడైకెనాల్ అడవులతో పాటు.. థాయ్ ల్యాండ్ లోని దట్టమైన అడవుల్లో చేశారు. నిజమైన అడవులకు కొద్దిగా గ్రాఫిక్స్ కూడా మిక్స్ చేసి.. అదరకొట్టారని తెలుస్తోంది.

జంగిల్ బుక్ లా

జంగిల్ బుక్ లా

సినిమా జంగిల్ బుక్ లాగ పూర్తి అడవితో నిండిపోయి ఉంటుంది. థాయ్ ల్యాండ్ లో 50 ఏనుగులతో ఆర్య చేసిన ఫైట్ ఈ చిత్రానికి హైలైట్ కానుందని చెప్తున్నారు. ప్రధానంగా విజువల్స్ ఈ చిత్రానికి స్పెషల్ కానున్నాయని తమిళ జనాలు అంటున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తికావచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి

మార్కెట్ గ్రాబ్ చెయ్యాలని

మార్కెట్ గ్రాబ్ చెయ్యాలని

అడవి వీరుడు అనే టైటిల్ పెడతారేమో అంటున్నారు ఈ పస్ట్ లుక్ చూసిన వారంతా...ఈ ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత తెలుగు నుంచి మంచి బిజినెస్ ఆఫర్స్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తో తెలుగు,మళయాళంలో మార్కెట్ గ్రాబ్ చెయ్యాలని ఆర్య ప్లాన్ అని తెలుస్తోంది. అందుకోసం ఆయన ఈ సినిమాకు ఎన్నడూ లేనంతగా కష్టపడుతున్నారు.

rn

తొలి పాట

కేథరిన్ ని తీసుకోవటం కూడా తెలుగు మార్కెట్ లో పాగా వెయ్యటానికే అంటున్నారు. ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రమోషన్స్ జరుగుతున్నాయి. తాజాగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన తొలి పాటను విడుదల చేశారు మేకర్స్. ఆ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.

English summary
The single track, which is titled 'Otha Paarvaiyil' released by the 'Thani Oruvan' hero Jayam ravi. 'Kadamban' aims to release on April 14.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu