'బన్నీ' నే ట్రెండ్ సెట్టర్...

వాస్తవానికి సీక్వెల్స్ సంస్కృతి హాలీవుడ్ లో బయిలుదేరి బాలీవుడ్ లో సెటిలైంది. ఇలా పాకిన ఈ ట్రెండు ఇప్పుడు దక్షిణాదినా ప్రవేశించింది. తాజాగా తమిళంలో అజిత్ తో 'భిల్లా' సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తుండగా ఇక్కడ పోకిరి కి సీక్వెల్ కి రంగం రెడీ అవుతోంది. అయితే వీటిన్నిటి కన్నా ముందే బన్ని ఈ తరహా సబ్జెక్టుకు పచ్చ జెండా ఊపటం విశేషం. దాంతో వాటిన్నటి కన్నా స్పీడుగా ఈ ప్రాజెక్టు ఫ్రారంభమవుతోంది భోగవల్లి ప్రసాద్, ఆదిత్యబాబు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం జూలైలో సెట్స్ మీదకు వెళ్లనున్నది.
ఇంతకుముందు రామ్‌గోపాల్ వర్మ 'మనీ' సినిమాకు సీక్వెల్‌గా 'మనీ మనీ'ని నిర్మించారు. కాని అవి చిన్న హీరోలు నటించిన హాస్య చిత్రం కావటం ..అందునా ఫ్లాప్ కావటంతో ఈ ట్రెండ్ కంటిన్యూ కాలేదు. బన్ని ప్రస్తుతం 'పరుగు' పూర్తి చేసి ఫ్రెషప్ అవటం కోసం అమెరికాలో హాలీడేస్ గడుపుతున్నాడు. జూన్ రెండో వారంలో అతను హైదరాబాద్‌కు వస్తాడు .ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్ కోసం ఎంపిక ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా హిట్ అయి ఇలాంటి సీక్వెల్స్ మరిన్ని వస్తే మాత్రం బన్ని ఈ విషయంలోనూ ట్రెండ్ సెట్టర్ అవుతాడని అభిమానులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











