»   » అల్లరి నరేష్ కు అన్నే విలన్

అల్లరి నరేష్ కు అన్నే విలన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కామెడీ హీరో అల్లరి నరేష్ కు ఈ మధ్య కాలంలో హిట్లు కరవు అయ్యాయి. అయినా హిట్,ఫ్లాపులకు సంభంధం లేకుండా పూర్తి బిజీగా ఉన్నాడు. బడ్జెట్ కంట్రోల్లో చేసే చిత్రాలు కావటంతో పెద్దగా నష్టం రాకపోవటం కూడా అతన్ని బిజిగా చేస్తున్న అంశం. ఇక తన చిత్రాల్లో విభిన్నత చూపాలనే నిర్ణయం తీసుకున్న నరేష్ తన తదుపరి చిత్రంలో తన అన్న ఆర్యన్ రాజేష్ ని విలన్ ని చేస్తున్నారు. తమ స్వంత బ్యానర్ లో నిర్మాణమయ్యే ఈ చిత్రంలో అన్నదమ్ములు ఇద్దరూ హీరో,విలన్ గా కనిపించి అలరించనున్నారు.

ఈ విషయమై అల్లరి నరేష్ మాట్లాడుతూ... త్వరలో అన్నదమ్ములిద్దరం ఓ చిత్రంలో నటించనున్నామని, అయితే ప్రతి నాయకుడిగా అన్న నటిస్తుంటే, తాను నాయకుడిగా నటిస్తుండడం కొత్తగా ఉంటుందని, అయితే తన చిత్రాలలో విలన్‌కు పెద్ద పాత్ర ఉండదన్న విషయం తెలిసిందేనని అన్నారు.

Aryan Rajesh turn villain to his brother

జూలై 1 నుంచి రాజమండ్రిలో 'బందిపోటు' ఫస్ట్ షెడ్యూల్ మొదలవుతుంది. ఈవీవీ సినిమాను ఎస్టాబ్లిష్ చేయాలనే తపనతో ఉన్నాం. అందుకోసం మా ప్రొడక్షన్‌లో సంవత్సరానికి మూడు సినిమాలు తీయాలనుకుంటున్నాం. నేను హీరోగా ఒక సినిమా, మిగతా రెండు బయటి హీరోలతో చేయాలనేది మా ప్రణాళిక. నన్ను దర్శకుడిగా చూడాలనేది నాన్నగారి కోరిక. కచ్చితంగా దర్శకత్వం చేస్తా. అది 2017లో సాధ్యపడవచ్చు అని తన తాజా చిత్రాల గురించి చెప్పుకొచ్చారు.

ఇక డిసెంబర్‌లోగా నా ఐదు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నా. చిన్నికష్ణ దర్శకత్వంలో వస్తున్న నాటుబాంబు (వర్కింగ్ టైటిల్) వచ్చే నెలలో విడుదల కానుంది. ప్రస్తుతం నా 48వ సినిమా నడుస్తోంది. నా యాభయ్యో సినిమా గురించి కొంచెం కేర్ తీసుకుంటున్నా. షార్ట్‌ఫిలిమ్స్ తీసిన యంగ్‌స్టర్స్ వచ్చి కథలు చెప్తున్నారు. ఇంకా ఏదీ సెలెక్ట్ చేసుకోలేదు. రాజేష్, నేను కలిసి నటించే చిత్రం వచ్చే ఏడాది రావచ్చు. మేం నడపబోతున్న ట్రస్ట్‌కు సంబంధించిన కార్యక్రమాలు కూడా త్వరలోనే ప్రారంభం అవుతాయి. నా ప్రతి సినిమా రెమ్యునరేషన్‌లో ఐదు లక్షలు ఆ ట్రస్ట్‌కు ఇస్తాను.

English summary
Aryan Rajesh who made his entry as hero before turning into producer expressed his desire to star in negative roles. Sharing the details he said he will soon play negative role in their own banner. Allari Naresh will be the hero in the film which will go to sets after the completion of Naresh's Bandipotu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu