»   » భర్తల ఎఫైర్ విషయమై ...షాకింగ్ లాజిక్ చెప్పిన నటి జీవిత, పెళ్లికు ముందు మ్యాటర్స్ కూడా

భర్తల ఎఫైర్ విషయమై ...షాకింగ్ లాజిక్ చెప్పిన నటి జీవిత, పెళ్లికు ముందు మ్యాటర్స్ కూడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఈ అమ్మాయితో నేను తిరుగుతున్నాను, ఈ అమ్మాయిని నేను ఉంచుకున్నాను అని పబ్లిక్ గా ఏ మగాడు చేప్పినా వాడితో ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎనీ పర్శన్..లస్ట్ అవనీయండి..అవుటాఫ్ ఎట్రాక్షన్ అవ్వనీయండి... నీకు తెలియకుండా నీ దగ్గర సీక్రెసీ మెయింటైన్ చేసి, వెళ్లి ఏదో ఒక ఎఫైర్ పెట్టుకున్నాడు అంటే దాని గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు జీవిత.

నిండైన చీరకట్టులో కనిపించే పరిపూర్ణమైన తెలుగింటి ఆడపడుచు నటి జీవిత. నిర్మాత, దర్శకురాలు. నటించిన చిత్రాలు తక్కువే అయినా బహుభాషా నటి. సినిమా ఒక బలమైన మీడియా అంటారామె. సమాజంలో హింస, ద్వేషం, సెక్స్‌ ధోరణులు తగ్గించి స్త్రీ వ్యక్తిత్వాన్ని కాపాడేందుకు తిరిగి సినిమా మీడియా ద్వారానే మార్పు తెచ్చి తీరాలి అంటారు జీవిత. ఆమె మాటలు సూటిగా ఆలోచనలు రేపేలా ఉంటాయి.

ఆమె రీసెంట్ గా వెబ్ మీడియాకు యాంకర్ స్వప్న ద్వారా ఇచ్చిన ఇంటర్వూలో పలు విషయాలు ప్రస్తావించారు. చాలా విషయాలపై నిక్చిచ్చిగా మనుస్సులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడి, తన అబిప్రాయాలు తెలియచేసారు

 పట్టించుకోవాల్సిన పనిలేదు

పట్టించుకోవాల్సిన పనిలేదు

నీకు తెలియకుండా వేరే వారితో ఎఫైర్ పెట్టుకున్నా భర్త సీక్రెసీ మెయింటైన్ చేస్తే పట్టించుకోవాల్సిన పనిలేదని, సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారంటే అర్దం నిన్ను ఇష్టపడటమే కదా అంటున్నారు.

 వదిలేయ్

వదిలేయ్


ఎట్ ద సేమ్ టైమ్ మనం ఒకే హోటల్ కు రెగ్యులర్ గా వెళ్లం కదా...ఒకే్ బట్టలు వేసుకోవటం లేదు కదా..మేబీ జస్ట్ ఫర్ హిజ్ ఫన్..గోయింగ్ సమ్ వేర్ ..అది నీకు హైడ్ చేసి వెళ్లాడు..నీకు తర్వాత ఏదో తెలిసింది. నువ్వు దాని గురించి పెద్ద ఇష్యూ చేయద్దు..వదిలేయ్..

 వైఫ్ కు తెలియకూడదు..

వైఫ్ కు తెలియకూడదు..


దాని గురించి డోంట్ లీవ్ యువర్ ఫ్యామిలీ.. బికాజ్ హి ఈజ్ ట్రైయింగ్ టు హైడ్ సమ్ ధింగ్ ఫ్రమ్ యు.. స్ట్రాంగ్లీ, నా వైఫ్ కు తెలియకూడదు అని ఏదన్నా బయిటకు వెళ్లాడు , వచ్చేసాడు అనుకుంటే దాని గురించి యూ డోంట్ మేక్ ఎ సీన్ అంటూ చెప్తున్నారామె.

 ఛీట్ చేస్తే మాత్రం..

ఛీట్ చేస్తే మాత్రం..


కానీ అదే సమయంలో నీ భర్త నిన్ను ఛీట్ చేస్తూ.. పెళ్లి చేసుకున్నాడా లేకపోతే ఇంకో ఫ్యామిలీని పెట్టాడు,నిన్ను వదిలేసాడు.. పట్టించుకోవటం లేదు..నిన్ను రోడ్డు మీదకు తీసుకు వచ్చేసాడు..నీ పిల్లలను పట్టించుకోవటం లేదు..దాని గురించి డిస్కషన్ వద్దు అన్నారామె.

 భార్య తప్పు చేసినా కూడా..

భార్య తప్పు చేసినా కూడా..


భర్త లాగే భార్య కూడా తప్పు చేస్తే తట్టుకోవాలి అని అంటున్నారు జీవిత. ఇదే విషయం చాలా షోస్ లలోతాను అడిగానంటున్నారామె. నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు భార్యను అడిగే హక్కు ఎక్కడ ఉంది అన్నారామె. నా పెళ్లాం వాడితో మాట్లాడింది..నువ్వు ఇష్టం వచ్చినట్లు తిరుగుతావు..కానీ నీ భార్య అదే చేస్తే తప్పేంటి..నీ వైఫ్ నిన్ను క్షమిస్తే..నువ్వూ నీ వైఫ్ ను కూడా క్షమించాలి అన్నారామె.

 అర్దం చేసుకోవాలి..

అర్దం చేసుకోవాలి..


మొగడుగా నీ భార్య నిన్ను అర్దం చేసుకోవాలని నువ్వు ఎంత అనుకుంటున్నావో..నువ్వు కూడా నీ భార్యను ...భర్తగా టు హండ్రెడ్ పర్శంట్ అర్దం చేసుకోవాలి . తను నిన్ను బిలీవ్ చేయాలంటే నువ్వు ఆమెను బిలీవ్ చేయాలి అన్నారామె. ఎవడితోనో బయిటకనపడిందని వదిలాసా..ఎవరితోనో ఫోన్ లో మాట్లాడిందని వదిలేసా అంటే కుదరుదు అన్నారామె.నువ్వు ఎవరితో పోన్ లో మాట్లాడలేదా..ఎవరికీ లిప్ట్ ఇవ్వలేదా అని భర్తని అడగాలి అన్నారామె.

 వదిలేయాలా వద్దా..

వదిలేయాలా వద్దా..

ఒకసారి డిసైడ్ చేసుకుని ఇతను వద్దు అనుకుని బయిటకు వస్తే...జీవితం బాగానే వెళ్తుంది. అంతా మైండ్లోనే ఉంటుంది. ఎందుకంటే చాలా మంది చదువు లేని ఆడవాళ్లలో తమ భర్తలని పోషించేది వాళ్లే. దెబ్బలు తినేది వాళ్లే. సంఘర్షణ అనేది మైండ్ లో ఉంది, నా మొగుడుని వదిలేయాలేదా అనేదే ప్లాబ్లం అక్కడే స్టక్ అయ్యిపోతారు అన్నారామె.

 చూసుకోకుండా మీడియా వాళ్లే

చూసుకోకుండా మీడియా వాళ్లే


ఆమధ్యన పెట్టిన నా మీద కేసు పెట్టారు. అయితే అది మీడియా సరిగ్గా చూసుకోకండే మాట్లాడుకోవటం తప్పు. ఎవరో జీవిత గారు మేనేజర్ ని మాట్లాడుతున్నా... నువ్వు షోకు రాకపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తాం అన్నారు. అప్పుడు వాళ్లు వెల్లి పోలీస్ కంప్లైంట్ పెట్టారు. అసలు ఆ కంప్లైంట్ పెట్టిన వాళ్లు ఎలా తీసుకున్నారు. నేను కేవలం యాంకర్ ని మాత్రమే. నాకు మేనేజర్లు లేరు. జీ టీవి మీద కేసు పెట్టాలి. పోలీస్ స్టేషన్ కు వెళ్గగానే... మీడియా వాళ్లు చూసుకోకండా రాసేసారు అన్నారామె. ఆ కేసు పెట్టినవాడు తాగుబోతు. వాడి పెళ్లాం కంప్లైంట్ ఇచ్చింది. అసలు నేను అనేది ఇంత మీడియా ఎందుకట్లా ఫోకస్ చేస్తారు అని ఆవేదనగా అన్నారామె.

 చెప్పుపట్టుకుని కొట్టి

చెప్పుపట్టుకుని కొట్టి

హిప్రొక్రెటిక్ గా మాట్లాడుకోవాలంటే...ఇప్పటికీ సినిమాల్లోనే కాదు బయిటకూడా పరిస్దితిలు మారలేదు. డిమాండ్ అండ్ నీడ్. ఖచ్చితంగా ఒకరి దగ్గరకు వెళ్లినప్పుడు బేరం పెడతారు. అలాంటి పరిస్దితుల్లో ఉమెన్ స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడు నో చెప్పి చెప్పు పెట్టి కొట్టి బయిటకు వచ్చి ఇలా చేసారని చెప్పచ్చు. అప్పుడు బ్రతకగలననే కాన్ఫిడెన్స్ ఉండాలి. అలాంటప్పుడే చాలా మంది ఆడవాళ్లే వీక్ మైండెడ్ అయ్యిపోతారు. ఆడవాళ్లను ఎవరూ ఎవరూ కాపాడలేరు.వాళ్లను వాళ్లే కాపాడుకోవాలి.

 ఆయన అన్నీ నాకు చెప్తారు

ఆయన అన్నీ నాకు చెప్తారు


ఒక అమ్మాయి ఫోన్ చేసి..మీరు నా దగ్గరకు రండి అన్నా కూడా నా భర్త నాకు చెప్తారు అంటున్నారు జీవిత. ఫలానా అమ్మాయి నాకు ఫోన్ చేసింది తెలుసా అంటారు. అలాంటివి చాలా ఇన్సిడెంట్ జరిగాయి అన్నారు.

 పెళ్లికి ముందే ఒకే గదిలో ..

పెళ్లికి ముందే ఒకే గదిలో ..


ఓ రోజు ఒంగోలులో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ సంఘటన జరగింది. అప్పుడికి ఇంకా మా పెళ్లి జరగలేదు. ఆల్రోస్ట్ మేము ఇద్దరం ఒకే రూమ్ లో ఉన్నాం. ఇండస్ట్రీలో చాలా మంది మా గురించి మాట్లాడుకున్నారు. పెద్ద టాపిక్ అయ్యింది. మా ఇంట్లోవాళ్లు చాలా కంగారు పడ్డారు. మా అమ్మ అడిగింది. మేం పెళ్లి చేసుకోకోపోయినా మేము ఇలాగే ఉంటాం అని చెప్పాను అన్నారు జీవిత. ఇద్దరం సోల్ మేట్స్ లాగే ఫీలయ్యాం అన్నారామె.

బ్రష్ చేసుకున్నట్లే

బ్రష్ చేసుకున్నట్లే


జీవితంలో సెక్స్‌ ఎంతో అవసరం. బ్రష్‌ చేసుకున్నట్టు, స్నానం చేసినట్టు, కాఫీ తాగినట్టు దాంపత్యసుఖం కూడా జీవితంలో భాగమే. దాంతోపాటే సహజీవనం కూడా వచ్చింది. ఏది వచ్చినా స్ర్తీ తన క్యారెక్టర్‌ కాపాడుకోవాలి. భార్య అయినా, ప్రాస్టిట్యూట్‌ అయినా...స్ర్తీ ఇష్టం లేకుండా పురుషుడు ఆమెతో గడపలేడు. భర్త దుర్మార్గుడు, దుష్టుడైతే వాడితోనే జీవితం గడపాల్సిన అవసరం లేదు. ‘పెళ్ళి చేసుకున్నా, నా చెప్పుచేతల్లో ఉండాలి' అనే ధోరణి కరెక్టుకాదు. అందుకే ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవాలి. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేం అనుకున్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. పిల్లల్ని కన్న తర్వాత మాత్రం కాంప్రమైజ్‌ కావడం చాలా ఇంపార్టెంట్‌ అని తేల్చి చెప్పారు జీవిత.

 ఇప్పుడెందుకో మళ్లీ

ఇప్పుడెందుకో మళ్లీ

యంగ్‌టైగర్ ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన టెంపర్ సినిమాలో ఒక డైలాగు గురించి అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు మళ్లీ ఆ డైలాగు గురించి చర్చ వచ్చింది. ఎప్పుడు ఎలా అంటారా..క్రింద చదవండి

ఎన్టీఆర్ తో అలాంటి డైలాగు చెప్పిస్తారా? జీవిత, సెక్స్ అవసరమే కానీ

English summary
Here is the latest Interview of Jeevitha Rajashekar in "Heart to Heart With Swapna". Jeevitha and Rajasekhar are More than just a couple, they are actors, filmmakers, politicians and keen businessmen.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu