»   » ప్రాణాలతో ఆటలా? బుద్ది ఉందా?? ఆ స్టంట్ చేసినందుకు హీరోని తిడుతూనే ఉన్నారు

ప్రాణాలతో ఆటలా? బుద్ది ఉందా?? ఆ స్టంట్ చేసినందుకు హీరోని తిడుతూనే ఉన్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాల్లో చూసే స్టంట్స్ అన్నీ హీరోలే చేస్తారు అన్న భ్రమలో ఉండేవాళ్ళు జనం.కానీ కొంత కొంతగా అసలు విషయాలు తెలిసాక "డూప్" స్టంట్ మాస్టర్ అనే పదాలు తెలిసాయి. తెరవెనుక ఉండే అసలైన హీరోలు బయటికి వచ్చారు. ఎన్నో సంధర్బాలలో రిస్కీ షాట్లు చేస్తూ ఈ డూప్ లు మరణించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇటీవలి కాలంలో సన్నివేశాలు వాస్తవికంగా కనిపించేందుకు డూప్‌లు లేకుండా, సరైన భద్రతా చర్యలు లేకుండా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మస్తిన గుడి

మస్తిన గుడి

అలా చేసిన సమయం లోనే మస్తిన గుడి అనే కన్నడ సినిమా షూటింగ్ లో నదిలో పడి కన్నడ స్టంట్ మాస్టర్లు ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఇంకా ఇలాంటి రిస్క్ తీసుకుంటూనే ఉన్నారు.. తాజాగా దేవ్ అనే డిటెక్టివ్ టీవీ సిరీస్ హీరో ఆశిష్ చౌదరి, అలాంటి ప్రమాదకరమైన స్టంట్‌నే చేశాడు.

ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా

ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా

ఒక టీవీ సిరీస్‌కు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ షూటింగ్ లో భాగంగానే 21 అంతస్తుల భవనంపై ఓ ప్రమాదకర స్టంట్‌ను చేశాడు ఆశిష్. చూసిన వాళ్ళ ఒళ్ళు గగుర్పొడిచేలా ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా 21వ అంతస్తు నుంచి సొంతంగా పైప్‌లైన్‌ను పట్టుకుని వేలాడే స్టంట్ చేశాడు.

స్వల్పంగా గాయపడ్డాడు

స్వల్పంగా గాయపడ్డాడు

అయితే ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు కూడా అలాంటి ఓ స్టంట్‌నే చేసిన ఆశిష్, స్వల్పంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో యూనిట్ వారించినా వినిపించుకోకుండా పట్టుబట్టి ఆ స్టంట్‌ను స్వయంగా చేశాడు. దీని గురించి స్వయంగా అతడు వెల్లడించాడు. దానికి సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు.

21వ అంతస్తు నుంచి వేలాడుతూ

21వ అంతస్తు నుంచి వేలాడుతూ

"5 నిముషాల సన్నివేశం కోసం 4 గంటల పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా 21వ అంతస్తు నుంచి అలాగే వేలాడుతూ ఉండిపోయాను" అని చెప్పాడు ఆశిష్. అయితే ఇంత సాహసం చేసినందుకు అంతా ఆయన్ని మెచ్చుకుంటారు అనుకున్నాడేమో కానీ ఇప్పటికే జరిగిన విషాదాన్ని మర్చిపోని జనం మాత్రం. ఆ ప్రాణాంతక మైన ఫీట్ చేసినందుకు చీవాట్లు పెడుతున్నారు.

English summary
Ashish was required to be suspended from a harness from atop a 21-storey building.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu