»   » ద్యా....వ్వుడా..! అప్పుడే అభిమాన సంఘం అట, టాలీవుడ్ లో మహేష్ బాబు వారసుడు...

ద్యా....వ్వుడా..! అప్పుడే అభిమాన సంఘం అట, టాలీవుడ్ లో మహేష్ బాబు వారసుడు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినీ పరిశ్రమలో అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికైనా సరే సూపర్ స్టార్ అంటే కృష్ణనే. మూడు దశాబ్దాల పాటు ఆయన వెండితెరపై మెరిశారు. ఆయన తర్వాత ఆయన నటవారసుడిగా ప్రిన్స్ మహేష్ బాబు ఎంటరయ్యాడు. ఈ తర్వాత అదే కుటుంబం నుంచి సుధీర్ బాబు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరో అందాల నటుడు ఆ ఇంటి నుంచి సినీ అరంగేట్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. అతను మరెవరో కాదు... కృష్ణ కుమార్తె, గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ల కుమారుడు గల్లా అశోక్.

గత కొంతకాలంగా టాలీవుడ్ హీరో కావాలని తపిస్తున్న అశోక్ అమెరికాలో నటనకు డాన్స్ కు సంబంధించి శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే. మహేష్ బాబును అత్యంత వీరాభిమానంతో అభిమానించే మేనల్లుడు అశోక్ టాలీవుడ్ ఎంట్రీకి మహేష్ ఆశిస్సులు కూడ ఉన్నట్లు టాక్.

Ashok Galla To Enter in Tollywood

వచ్చే సంవత్సరం ఈ యంగ్ హీరోని టాలీవుడ్ కి హీరోగా పరిచయం చేయాలి అన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే గల్లా జయదేవ్ కొందరు యంగ్ డైరెక్టర్స్ చెపుతున్న కథలను వింటున్నట్లు టాక్. అయితే ఈసినిమాను గల్లా జయదేవ్ నిర్మిస్తాడా లేదంటే మహేష్ సొంత బ్యానర్ లో ఈ మూవీని నిర్మిస్తారా ? అన్న విషయమై ప్రస్తుతానికి క్లారిటీ లేదు అని అంటున్నారు.

ఇంకా హీరోగా కూడ పరిచయం కాకుండానే అశోక్ గల్లా పేరిన "గల్లా యువ సైన్యం" అనే అభిమాన సంఘం అశోక్ పేరిట ఏర్పడింది అంటే అత్యంత భారీ ప్లాన్స్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మరొక యంగ్ హీరోకి కౌంట్ డౌన్ మొదలైంది అనుకోవాలి.. ఇప్పటికే నటనలో శిక్షణ పొందిన అశోక్... మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాడు. మరో విషయం ఏమిటంటే... అశోక్ తెరంగేట్రం తమ సొంత బ్యానర్ లోనే ఉంటుందని గల్లా జయదేవ్ కూడా ప్రకటించారు.

English summary
The acting bug bit Ashok Galla long back. Upon seeking advise of Mahesh Babu, This Young Lad has underwent necessary training to fine tune his skills. And now, He is fully prepared to test his luck in the glamour field.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu