»   »  అసిన్ కి ఆ నీళ్ళు వంట బట్టి...

అసిన్ కి ఆ నీళ్ళు వంట బట్టి...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Asin
కేరళ కుట్టి అసిన్ కి వాస్తవానికి సౌత్ సినిమానే లైఫ్ ఇచ్చింది. తెలుగు ,తమిళ,మళయాళ ప్రేక్షకులే ఆదరించి అక్కున చేర్చుకున్నారు. కాని ఆమె మాత్రం ఇక్కడ సినిమాలపై చిన్న చూపు పెంచుకుంటోందింట. మార్కెట్ స్పాన్ ఎక్కువ ఉన్న హిందీ చిత్రాలే గొప్పవని అంటోంది. అసలు ఇదంతా తమిళం, తెలుగు భాషల్లో హిట్ అయిన గజనీ చిత్రం హిందీ రీమేక్‌లో అమీర్ ఖాన్ ప్రక్కన చేయటంతో వచ్చింది. ఆమె నటన గూర్చి అక్కడ పత్రికలు ఊదరకొడుతున్నాయి. దాంతో ఆమెకి రెండు ఆఫర్లు వచ్చాయి.

ఇందులో సల్మాన్ ఖాన్ జోడీగా విపుల్ షా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఒకటి. ఇందులో అజయ్ దేవగన్ కూడా నటించనున్నాడు. ఇదిగాక అక్షయ్ కుమార్ సరసన మరో చిత్రంలో నటించబోతోంది. ఈ చిత్రాలు హిట్ అయితే బాలీవుడ్ లో ఆమెకు ప్రత్యేక స్ధానం వస్తుందని ఆశిస్తోంది. అలా అసిన్ ఆల్ ఇండియా స్టార్ కావాలనే ఆలోచనలతో ముందుకు వెళ్తోంది. మన సౌత్ అమ్మాయి అక్కడ ఎదగటం ఆనందమే గాని...అక్కడ నీళ్ళు వంటబట్టి మన సినిమాలు చిన్న చూపు చూడటం మంచిది కాదంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X