»   »  చెన్నయ్ కు అసిన్ టాటా!

చెన్నయ్ కు అసిన్ టాటా!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హిందీ గజినీలో అమీర్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని కొట్టేసిన అసిన్ ఇపుడు మొత్తంగా మారిపోయింది. వ్యక్తిగతంగానే కాదు..ఏకంగా చెన్నయ్ నుంచి తన మకాంనే మార్చేసింది. చెన్నయ్ లోని హ్యారింగ్టన్ రోడ్ ఉన్న తన ఫ్లాట్ ను ఖాళీ చేసింది. ముంబైలోని లోఖంత్వాలాలో కొత్త ఇల్లును తీసుకుంది. తమిళంలో వస్తున్న పెద్ద పెద్ద అవకాశాలను సైతం కాదని ముంబై వైపే అసిన్ తన దృష్టిని కేంద్రీకరించింది. తిరిగి చెన్నయ్ వస్తుందో లేదో తేలియదు కానీ తాత్కాలికంగానైన చెన్నయ్ కు టాటా చెప్పిందన్నమాట. బాలీవుడ్ లో అవకాశాలు తలుపు తట్టుతుండడంతో ఆరు నెలల క్రితమే అసిన్ చెన్నయ్ లోని ఆంధేరిలోని జుహు కాంప్లెక్స్ లో ఇల్లును కూడా కొంది. ఇపుడు లోఖంత్వాలా ప్రాంతంలో కొత్త ఇంటిలోకి మారింది. తమిళ విషయానికి వస్తే ఆమె నటించిన దశావతారం సినిమా ఒకటే విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాకు ముందు మూడి సినిమాలలో కనిపించింది. అందులో పోకిరి, వెల్ సినిమాలు విజయం సాధించగా, అఝ్వర్ అట్టర్ ఫ్లాప్ అయింది. హిందీలో అసిన్ కు అమితాబ్ కూతురు నిర్మించే సినిమాలో అవకాశం వచ్చింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X