»   » అసిన్ ని అవమానించిన నిర్మాత..కారణం

అసిన్ ని అవమానించిన నిర్మాత..కారణం

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేను 'అప్‌కమింగ్ యాక్ట్రస్"నో కాదో ప్రేక్షకులకు తెలుసు. సినిమాల వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించడం వల్లే చాలామందికి ఇక్కడ నేను శత్రువుని అయిపోయాను. ఈ కారణంగానే నన్ను ఏదో ఒక విధంగా అవమానించడానికి ఈ ప్రచారం మొదలుపెట్టారు. వారికి సమాధానం నేను చెప్పను. నా సినిమాలు చెబుతాయి"" అంటూ ఆవేశంగా మాట్లాడింది అసిన్.ప్రముఖ నిర్మాత ముఖేష్ భట్ రీసెంట్ గా ఆమెను ఆమె జస్ట్ అప్‌కమింగ్ యాక్ట్రస్ మాత్రమే కానీ స్టార్ ఏ మాత్రం కాదని అన్నారు.దాంతో ఆ వార్త అసిన్ ని చాలా భాధపెట్టింది.

మరో ప్రక్క బాలీవుడ్ మీడియా ఆమెను 'లక్కీస్టార్"గా అభివర్ణిస్తూ వందకోట్లకు పైగా కలెక్ట్ చేసిన చిత్రాల్లో నటించిన క్రెడిట్ ఇప్పటివరకూ కరీనాకపూర్‌కి మాత్రమే ఉందని, అయితే ఆమెది పన్నెండేళ్ల సుదీర్ఘమైన కెరీర్ అనీ, కానీ అసిన్ వచ్చిన మూడేళ్లకే... వందకోట్లు పైగా వసూలు చేసిన రెండు చిత్రాల్లో నటించడం విశేషం అని రాసింది.దాంతో బాలీవుడ్ లోని కొందరు పెద్దలు ఇలా నెగిటివ్ గా స్పందించి ఆమె మనస్ధాపానికి కారణమయ్యారు.

దానికి ఆమె కౌంటర్ గా ...నేను కరీనాకపూర్ అంత నటినీ కాదు, స్టార్‌ని అంతకన్నా కాదు. ఆమెతో కంపైర్ చేస్తూ నాపై కథనాలు వెలువడ్డాయంటే... నేను చాలా సాధించినట్టే అంది.ఇక ముఖేష్ భట్ ఓ లో బడ్జెట్ చిత్రం ఆమె డేట్స్ అడిగితే అసిన్ నో చెప్పటమే ఈ వివాదానికి కారణమని తెలుస్తోంది.దాంతో ఆయన రెచ్చిపోయి ఇలా రివర్స్ లో ఆమెపై కామెంట్స్ చేస్తున్నారని వినపడుతోంది.

English summary
Mukesh Bhatt to launch a full-fledged verbal attack against actor Asin on a TV channel, saying that 'she has no future in Bollywood'?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu