»   »  ఆశతో ఆసిన్, నిరాశతో త్రిష

ఆశతో ఆసిన్, నిరాశతో త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu
Asin
రజనీకాంత్ సినిమాలో అవకాశం కోసం ఆసిన్, త్రిషలు కాచుకుని కూర్చుకున్నారట. త్రిష తన కాల్షీట్స్ ను ఖాళీగా ఉంచి చాలా కాలం వేచి చూసి చివరికి విసుగొచ్చి ఇతర సినిమాలను అంగీకరించిందని అంటున్నారు. అయితే ఆసిన్ కు ఇంకా ఆశ చావలేదట. ఆమె ఇంకా తనకు ఆ అవకాశం రాకపోతుందా అని ఎదురు చూస్తోందట.

కుచేలుడు సినిమాలో గానీ, శంకర్ దర్శకత్వం వహిస్తున్న రోబోలో గానీ తనకు అవకాశం దక్కుతుందని త్రిష ఎదురుచూసింది. కుచేలుడు సినిమా హీరోయిన్లుగా నయనతార, టబు ఎంపికయ్యారు. రోబో సినిమాకు ఐశ్వర్యారాయ్ ను లేదా దీపికపడుకొనేను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ పాత్ర కోసం నిరీక్షించి విసిగిపోయిన త్రిష ఇతర సినిమాల్లో బిజీ అయిపోయింది. ప్రస్తుతం కమలహాసన్ దశావతారం సినిమాలో నటిస్తున్న ఆసిన్ మాత్రం ఇంకా తనకు ఆ అవకాశం రాకపోతుందా అని నిరీక్షిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X