»   » నో అందని అసిన్ ని ఆ నిర్మాత

నో అందని అసిన్ ని ఆ నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

అసిన్ బాలీవుడ్ లో ఆచి తూచి అడుగుల వేసే ఆలోచనలో ఉంది. ఈ నేపధ్యంలో ఆమెను ప్రముఖ నిర్మాత ముఖేష్ భట్ డేట్స్ అడగటం జరిగింది. ఆమె చుట్టూ తిరిగే కథతో వారు సినిమా ప్లాన్ చేసారు. అయితే అసిన్ వెంటనే నో చెప్పేసింది. అది మనస్సులో పెట్టుకునే ఏమో గానీ ఆమె జాగ్రత్తగా లేకపోతే బాలీవుడ్ లో భవిష్యత్ ఉండదని స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఆయన అక్కసుతో అన్నాడా లేదా అసిన్ నిజంగానే గర్వంతో వ్యవహిస్తోందా అనిది ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఆయన రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ.. అసిన్‌ హీరోయిన్ గా నటించడం వల్లే 'గజిని', 'రెడీ' సినిమాలు హిట్ అవ్వలేదు. అందులో అమీర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ల ట్యాలెంట్, స్టార్ డమ్ ఉంది. కానీ అసిన్‌ మాత్రం తనో గొప్ప నటినని భావించుకొంటోంది. అప్పుడే అలాగైతే ఎలా.. భవిష్యత్తు ఉండదు. స్టార్ హీరోల పక్కన అందమైన నటిగా కనిపించడం వేరు. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొనే పాత్రలు పోషించడం వేరు. అసిన్‌ రెండో తరహా పాత్రల వైపు చూస్తేనే బాగుంటుందని అన్నారు.

English summary
Mukesh said, “I don't feel that Asin has a great future in Bollywood.Her role in 'Ghajini','Ready' films was nothing great and the film did not do well because of her performance. No, not at all,” said Bhatt.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu