క్రికెటర్ శ్రీశాంత్‌తో అసిన్ నటించడం లేదు
'బిగ్ పిక్చర్' అనే చిత్రం ద్వారా శ్రీశాంత్ సినీ హీరోగా పరిచయం కాబోతున్నారు. కొన్ని రోజులుగా వినిపిస్తున్న రూమర్ ఏమిటంటే....ఈచిత్రంలో అసిన్ హీరోయిన్ నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారం నిజం కాదని తేలింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పి. బాలచంద్రన్ ఈ విషయం స్వయంగా వెల్లడించారు. ఆసిన్ శ్రీశాంత్‌తో నటించడం లేదని స్పష్టం చేసారు.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా పలువరు బాలీవుడ్ నటీమణులతో చర్చలు జరుపుతున్న మాట వాస్తవమే అని, అయితే ఇప్పటి వరకు ఎవరూ ఖరారు కాలేదని దర్శకుడు స్పష్టం చేసారు. అయితే సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం క్రికెట్ కుంభకోణంలో ఇరుక్కున్న శ్రీశాంత్ తో చేయడానికి గుర్తింపు ఉన్న ఏ హీరోయినూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
గతంలో శ్రీశాంత్ ఓ మళయాల చిత్రంలో అతిథి పాత్రలో నటించారు. అయితే ఆ సినిమా విడుదలకు ముందు ఐపీఎల్ కుంభ కోణం వెలుగు చూడటంతో సినిమాపై దుష్ప్రభావం చూపుతుందనే భయంతో ఆయన నటించిన సన్నివేశాన్ని సినిమా నుంచి తొలగించారు.


Click it and Unblock the Notifications












