»   »  అసిన్..క్యా సీన్ హై!!

అసిన్..క్యా సీన్ హై!!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Asin
'గజనీ' సినిమాతో బాలీవుడ్ లో లాంచ్ అయిన అసిన్ ఇప్పుడు అక్కడ హాట్ ప్రాపర్టీగా మారింది. ఆమె హీరోయిన్ గా త్వరలో తీయబోతున్న లండన్ డ్రీమ్స్ సినిమా వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 120 కోట్ల రూపాయలుకు అమ్ముడయి భాక్సా ఫీసు కి కొత్త అర్ధం చెప్పింది. అమీర్ ఖాన్ గజనీ సినిమా 93 కోట్లకు అమ్ముడవటం పెద్ద విశేషమని పబ్లిసిటీ చేసుకున్న వారంతా ఇది విని షాక్ అవుతున్నారు.అయితే ఇది అసిన్ గొప్పతనం కాదని కొందరంటున్నారు. విపుల్ షా లేటెస్ట్ మెగా హిట్ సింగ్ ఈజ్ కింగ్ ఎఫెక్ట్ అంటున్నారు. ఇక ఈ లండన్ డ్రీమ్స్ సినిమా కోసం అసిన్ సెప్టెంబర్ లో లండన్ కి వెళ్ళటానికి ప్రిపేరవుతోంది. అలాగే ఈ సినిమాలో అసిన్ కు తోడుగా సల్మాన్ ఖాన్,అజయ్ దేవగన్ నటిస్తున్నారు.సినిమా మొత్తం లండన్ లో జరుగుతుంది. అంతేగాక హమ్ దిల్ దే చుకే సనమ్ తర్వాత అజయ్,సల్మాన్ కలసి చేస్తున్న చిత్రం కావటంతో అసిన్ ని అందులో ఐష్ తో పోలుస్తున్నారు. ఏదైమైనా భలే లక్కీ ఫెలో కదా..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X