For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరాఠీ ముద్దుగుమ్మగా అసిన్‌

  By Srikanya
  |

  న్యూఢిల్లీ: ఇటీవల వస్తున్న హిందీ చిత్రాల్లో పేరున్న కథానాయికలు మహారాష్ట్ర మగువలుగా కనిపించడం సర్వ సాధారణమయింది. వారిలో ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్‌, విద్యాబాలన్‌ (ప్రత్యేక గీతంలో), రాణిముఖర్జీ వంటి వారు మహారాష్ట్ర సంప్రదాయ వస్త్రధారణలో ప్రేక్షకులను అలరించారు. ఇటు దక్షిణాదిన విజయవంతమైన చిత్రాల్లో నటించి తన సత్తా ఏమిటో నిరూపించి అటు బాలీవుడ్‌లోనూ జెండా ఎగురవేయడానికి ముంబాయిలో మకాం వేసిన అందాల అసిన్‌ కూడా ఈ పరుగుపందెంలో ఎందుకు వెనుకబడుతుంది. అందుకే అక్షయ్‌ కుమార్‌ హీరోగా రూపుదిద్దుకుంటున్న 'ఖిలాడి 786' అనే చిత్రంలో అసిన్‌ మహారాష్ట్ర స్త్రీ అవతారంలో ప్రేక్షకులను అలరించనుంది. వచ్చేనెల మొదటి వారంలో సినిమా హాళ్లలో ప్రదర్శించనున్న ఈ చిత్రంలో ఇందు టెండూల్కర్‌ పాత్రలో మరాఠి మగువగా కనిపించడమే కాకుండా మరాఠీ ఉచ్ఛారణతో అందరిని ఆశ్చర్యపరచనుంది.

  అక్షయ్‌ కుమార్‌, అసిన్‌ జంటగా నటించిన చిత్రం 'కిలాడీ 786'. ఆశిష్‌ ఆర్‌.మోహన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో అసిన్‌ మరాఠీ యువతి పాత్రలో దర్శనమీయబోతోంది. ఇందుకోసం ఆమె ఆ భాషను నేర్చుకోవల్సి వచ్చింది. మరాఠీ నేర్చుకోవడం గురించి అసిన్‌ చెబుతూ ''అక్షయ్‌ కుమార్‌కి మరాఠీ భాష మీద మంచి పట్టు ఉంది. ఆయన బాగా మాట్లాడతారు. ఈ సినిమా కోసం నేను కూడా ఆ యాసతో కూడిన హిందీ సంభాషణల్ని పలికించేందుకు శ్రమించాను. ఈ విషయంలో అక్షయ్‌ ఎంతగానో సాయం చేశారు. ఇందులో తొలిసారిగా ఇందు టెండుల్కర్‌ అనే మరాఠి యువతి పాత్రను పోషించడం ఎంతో ఆనందంగా ఉంది. ఎంతో సరదాగా సాగిపోయే పాత్ర. కావల్సినంత వినోదం ఉంటుంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం ఖాయము''అని వెల్లడించింది.

  తన సరసన నటిస్తున్న హీరో అక్షయ్‌ కుమార్‌కు స్వచ్ఛమైన మరాఠీ భాష తెలుసునని, ఈ సినిమాలో తాను సంభాషణలు దోషరహితంగా పలకడానికి ఆయన ఎంతో సహాయం చేస్తున్నారని సంతోషపడిపోతోంది ఈ కేరళ కుట్టి. ఈ సినిమాలో తన పాత్రకు అవసరమైన చీరలను తానే స్వయంగా ఎంపిక చేసుకున్నానని, సంప్రదాయ మరాఠీ చీరలైన 'నవ్వారి' చీరలు తనకు ఎంతో నచ్చాయని మురిసిపోతోంది అసిన్‌. మరాఠీ భాషపై మరింత పట్టుసాధించడం కోసం ఆ భాషను మాట్లాడే చిత్ర బృందంతో తరచుగా సంభాషిస్తుందట అసిన్‌‌. సంప్రదాయ నవ్వారి చీరను ధరించి అసిన్‌ సెట్టులో అడుగుపెడుతుంటే కనులపండువగా ఉంటుందని, ఈ పాత్ర ప్రేక్షకులకు కనువిందు చేస్తుందని దర్శకుడు ఆశిష్‌ ఆర్‌.మోహన్‌ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

  గతంలో అసిన్‌ నటించిన హౌస్‌పుల్‌-2, బోల్‌బచ్చన్‌ చిత్రాలు రెండూ బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకున్నాయని తన ఈ మూడో చిత్రం ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటుందని, హ్యాట్రిక్‌ ఖాయమని అసిన్‌ కొండంత ఆశతో ఉంది. ఈ ఖిలాడీ 786 చిత్ర నిర్మాతల్లో అక్షయ్‌ కుమార్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా ఒక భాగస్వామి కావడం చెప్పుకోదగ్గ విషయం. డిసెంబరు 7న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

  English summary
  Asin and Akshay Kumar make a rocking pair in upcoming action flick Khiladi 786. The film is an action comedy directed by Ashish R Mohan. Featuring Akshay Kumar in the title role with Asin playing the female lead. Katrina Kaif, Vidya Balan, Rani Mukherjee and Priyanka Chopra have all done it, and now it’s the southern siren Asin’s turn to take the audiences by storm with her Marathi mulgi avatar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X