»   » మైక్రోమాక్స్ అధినేతతో హీరోయిన్ అసిన్ పెళ్లి.. (ఫోటోస్)

మైక్రోమాక్స్ అధినేతతో హీరోయిన్ అసిన్ పెళ్లి.. (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాతో తెలుగులో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన మళయాలీ భామ అసిన్... ఆ సినిమా ఘన విజయం సాధించడంతో తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకోవడంతో పాటు తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అమీర్ ఖాన్ హీరోగా హిందీ వెర్షన్ ‘గజిని' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అసిన్ ఆ సినిమా అక్కడ భారీ విజయం సాధించడంతో మళ్లీ సౌత్ సినిమాల వైపు చూడలేదు. ఆ తర్వాత ఆమె కెరీర్లో రెండు మూడు హిట్లకు మించి లేవు.

బాలీవుడ్లో అవకాశాలు తగ్గిన తర్వాత అయినా అసిన్ మళ్లీ సౌత్ వైపు వస్తుందని అంతా ఊహించారు. కానీ అలా జరుగలేదు. బాలీవుడ్లోనే నిర్మాతగా తన తన అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. బాలీవుడ్లో అసిన్ నటించిన చివరి చిత్రం ‘కిలాడీ 786' 2012లో విడుదలైంది. ఆ సినిమా పరాజయం పాలైంది. మళ్లీ అప్పటి నుండి ఇప్పటి వరకు అసిన్ ఏ సినిమాలోనూ కనిపించలేదు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ‘ఆల్ ఈజ్ వెల్' అనే సినిమాలో నటిస్తోంది. అభిషేక్ బచ్చన్ హీరో. ఈ నెలలో ఈ సినిమా విడుదల కాబోతోంది.

ఆ సంగతి పక్కన పెడితే ఆసిన్ ఇక పూర్తిగా సినిమాలకు దూరం కాబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం అసిన్ త్వరలో పెళ్లి చేసుకోబోతుండటమే అంటున్నారు. మైక్రో మాక్స్ మొబైల్ కంపెనీ ఫౌండర్ రాహుల్ శర్మను అసిన్ పెళ్లాడబోతోంది. 39 ఏళ్ల రాహుల్ శర్మతో అసిన్ గత కొంతకాలంగా డేటింగ్ చేస్తోంది. ఇద్దరి మనసులు కలవడంతో పాటు, అభిప్రాయాలు కూడా కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

సినిమాలకు దూరంగా

సినిమాలకు దూరంగా

పెళ్లి తర్వాత అసిన్ సినిమాల దూరంగా ఉండాలని, పూర్తిగా తన పెర్సనల్ లైఫ్ కే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుందట.

రెండేళ్ల క్రితమే ఆపేసా..

రెండేళ్ల క్రితమే ఆపేసా..

ఆ మధ్య అసిన్ మాట్లాడుతూ... రెండేళ్ల క్రితం నుండి తాను కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయడం మానేసాను అని చెప్పింది. దీన్ని బట్టి ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి నటనకు దూరం అవ్వాలని యోచిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

గజినీ కనెక్షన్ రియల్ లైఫ్ లో...

గజినీ కనెక్షన్ రియల్ లైఫ్ లో...

అసిన్ కెరీర్లో పెద్ద హిట్ ఇటు సౌత్ లో సూర్యతో తీసిన గజినీ, అటు బాలీవుడ్ అమీర్ కాన్ తో తీసిన గజినీ. ఈ సినిమాలో అసిన్ మొబైల్ కంపెనీ ఫౌండర్ తో ప్రేమలో పడుతుంది. తాజాగా రియల్ లైఫ్ లోనూ ఆమె మైక్రోమాక్స్ మొబైల్ కంపెనీ ఫౌండర్ తో ప్రేమలో పడటం గమనార్హం.

త్వరలోనే పెళ్లి డేట్

త్వరలోనే పెళ్లి డేట్

అసిన్, రాహుల్ శర్మ గత కొంత కాలంగా డేటింగులో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. త్వరలో ఇద్దరూ పెళ్లి డేట్ ప్రకటించనున్నారు.

గెస్ట్ లిస్ట్

గెస్ట్ లిస్ట్

వీరి వివాహానికి సినీ పరిశ్రమ నుండి ప్రముఖులతో పాటు, మల్టీ నేషనల్ కంపెనీల నుండి వీఐపీలు హాజరు కాబోతున్నారు.

రాహుల్ శర్మ గురించి..

రాహుల్ శర్మ గురించి..

మైక్రో మాక్స్ మొబైల్ కంపెనీ కో ఫౌండర్లలో రాహుల్ శర్మ ఒకరు. ఆ సంస్థకు ఆయన ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆపీసర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలోని యంగెస్ట్ సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్లలో రాహుల్ శర్మ ఒకరు.

English summary
According to a report by Times of India, Asin will soon tie the knot with Rahul Sharma, the founder of Micromax mobile company. The 39 year old businessman and Asin have been dating for quite some time now and have finally decided to get married.
Please Wait while comments are loading...