»   » అసిన్‌ కి కాబోయే భర్త బర్త్ డే గిప్ట్ ఏంటంటే

అసిన్‌ కి కాబోయే భర్త బర్త్ డే గిప్ట్ ఏంటంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ నటి త్వరలో మైక్సో మాక్స్ సీఈవోరాహుల్ శర్మ ని వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాహుల్ శర్మ...అసిన్ పుట్టిన రోజుకు ప్రత్యేకమైన గిప్ట్ ఇచ్చాడు. అది మరేదో కాదు ఆమె గది మొత్తం పూలతో నింపేసాడు. ఆ మేరకు అసిన్ ఇనిస్ట్రిగ్రామ్ ఈవిషయాన్ని ఫొటోతో పోస్ట్ చేసింది. మీరూ ఇక్కడ చూడండి.

బర్త్ డే గిప్ట్ ఏంటంటే

నటి అసిన్‌ సినీ రంగంలో పూర్తి స్థాయిలో అవకాశాలు కోల్పోవడంతో తీవ్ర ఆవేదనతో ఉంది. గతంలో 'ఎం కుమరన్‌ సన్‌ ఆఫ్‌ మహాలక్ష్మి' చిత్రం ద్వారా తమిళ తెరపైకి వచ్చి వరుస విజయాలు దక్కించుకున్న అసిన్‌ నటుడు సూర్యతో కలిసి 'గజినీ' చిత్రంలో నటించి మరింత ఉన్నత స్థాయికి చేరారు. ఘన విజయం సాధించిన ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ బాట పట్టారు.

Asin's fiancée Rahul Sharma surprises her with the most adorable gift!

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో నటించి విజయకేతనం ఎగురవేశారు. ఆ తర్వాత కొన్ని చిత్రాలు వూహించిన స్థాయిలో విజయం సాధించక పోవడంతో అవకాశాలు కోల్పోయారు. చాలాకాలం తర్వాత మళ్లీ 'ఆల్‌ ఇన్‌ వెల్‌' చిత్రంలో అభిషేక్‌ బచ్చన్‌తో నటించే అవకాశం వచ్చింది.

ఆ చిత్రం షూటింగ్‌ జరుగుతుండగానే ప్రముఖ మొబైల్‌ సంస్థ 'మైక్రోమేక్స్‌' యజమానితో ఈమెకు ప్రేమ కుదిరిందని, వీరి వివాహం త్వరలో జరుగనుందంటూ వార్తలు వెలువడాయి. ఇదిలా ఉండగా 'ఆల్‌ ఇన్‌ వెల్‌' చిత్రం విజయం సాధించకపోవడంతో ఆవేదనలో కూరుకుపోయింది.

ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందని బావించగా నిరాశే మిగిలిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం విజయం సాధిస్తే ఆనందంగా తాను సినిరంగానికి వీడ్కోలు పలుకుతానని భావించారట. కాని ఆమె అంచనాలు తారుమారయ్యాయి.

English summary
Bollywood's pretty actress Asin is soon about to tie the knot with Rahul Sharma who is founder and CEO of Micromax. Asin apparently met Rahul through a common friend and since then, she had been spotted with him on several occasions.
Please Wait while comments are loading...