»   » హీరోయిన్ అసిన్ పెళ్లి ఇన్విటేషన్ ఇదే... (ఫోటో)

హీరోయిన్ అసిన్ పెళ్లి ఇన్విటేషన్ ఇదే... (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అసిన్... తన బాయ్ ఫ్రెండ్, బిజినెస్ మేన్ రాహుల్ శర్మను వివాహమాడబోతున్న సంగతి తెలిసిందే. జనవరి 23వ తేదీన ఢిల్లీలో గ్రాండ్ గా వివాహ వేడుక జరుగబోతోంది. ఇక ముంబైలో ఫిల్మీ స్టైల్ లో వెడ్డింగ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు వెడ్డింగ ఇన్విటేషన్స్ అందాయి. వీరి మధ్య ప్రేమ వ్యవహారం మొదలు కావడానికి కారణం బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.

రాహుల్ శర్మ అక్షయ్ కుమార్ ఫ్రెండ్ కావడం.... ఆయతో పాటు నటించిన అసిన్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరూ దగ్గరయ్యాడు. వీరి లవ్ ఎఫైర్ ను అక్షయ్ కుమార్ ఎంకరేజ్ చేయడంతో ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి నుండి ఇన్విటేషన్ అందుకున్న అక్షయ్ కుమార్.... దాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు.

 Asin's wedding invite

అలా లవ్ లో పడ్డారు...
అసిన్ ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో తమ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, ప్రేమ ఎలా పుట్టింది, పెళ్లికి దారి తీసిన పరిణామాలు వివరించింది. తమ మధ్య బంధం బలపడటానికి కారణం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అనే అసిన్ చెప్పుకొచ్చారు. రాహుల్, అక్షయ్ స్నేహితులు కావడమే ఇందుకు కారణం అంటోంది. అంతే కాదు తమ మధ్య సంథింగ్ మొదలైందని అక్షయ్ మొదట్లోనే కనిపెట్టేసి ప్రోసీడ్ అన్నాడట.

 Asin's wedding invite

రాహుల్ శర్మతో పరిచయం, ప్రేమ వ్యవహారం అనుకోకుండా జరిగిందని అసిన్ తెలిపారు. గజిని సినిమాలోలానే నా జీవితంలో జరిగింది. తొలిసారి ముంబై విమానాశ్రయంలో కలుసుకున్నామని తెలిపారు. తొలుత నన్ను హాయ్ అంటూ పలకరించారు. తర్వాత విమానంలో పక్క పక్కనే కూచున్నాం. అప్పటి నుండి ఫోన్లో మాట్లాడుకునే వాళ్లం అని అసిన్ తెలిపారు. ఒకానొక రోజు అతడే ఫోన్ చేసి చెప్పాడు. మీ ఇంట్లో వాళ్లను కలుస్తా. పెళ్లికి ఒప్పిస్తానని చెప్పాడు. అతను జంటిల్మెన్‌లా ప్రపోజ్ చేసిన తీరు నచ్చిందని అసిన్ చెప్పుకొచ్చింది.

English summary
Action hero, Akshay Kumar on Sunday revealed the official wedding invite of the famous actress Asin and her fiancee Rahul Sharma on Twitter.
Please Wait while comments are loading...