For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అసిన్ కి ఇల్లుని గిప్ట్ గా ఇచ్చిన రహస్య ప్రేమికుడు

  By Srikanya
  |

  ముంబై: అసిన్ ని గత ఆరు నెలలగా ఓ సీక్రెట్ ప్రేమికుడు వెంబడిస్తున్నాడు. ఆమెను డైరక్ట్ గా ఇప్పటివరకూ అతను కలవలేదు. అయితే ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ మెయిల్స్ పెడుతున్నాడు. అంతేగాక ఎన్నో గిప్ట్ లను ఇప్పటివరకూ ఇచ్చి ఉన్నాడు. తాజాగా అతను మరో అడుగు ముందుకు వేసి బెంగుళూరు ఓ ఇల్లుని గిప్ట్ గా ఇచ్చారు. రీసెంట్ గా తన ఇంటివివరాలును చెప్తూ..దాన్ని ఆమెకు దాన్ని గిప్ట్ గా ఇస్తున్నానని ఓ లెటర్ పంపాడు. దాంతో అయినా ఆమె కరిగి అతన్ని పెళ్లి చేసుకుంటుందని భావిస్తున్నాడు. ఇప్పటివరకూ నగలు,చాక్లెట్స్,పూలు వంటి ఎన్నో గిప్ట్ లు పంపినా అసిన్ ఓ సాధారణ అభిమానిగానే అతన్ని భావించింది.

  ఆ రహస్య ప్రేమికుడు పంపే లవ్ లెటర్స్ తో తన మెయిల్ భాక్స్ నిండిపోయింనా క్యాజువల్ గా తీసుకుంది. అయితే ఇప్పుడు ఈ సంఘటనతో ఆమె సీరియస్ గా ఆలోచించాల్సిన సమయం వచ్చిందంటున్నారు. ఇక ఈ ఇల్లు గిప్ట్ గా పంపటమనే విషయమై ఆమె మేనేజర్ ని సంప్రదిస్తే కరక్టే అని కన్ఫర్మ్ చేసి చెప్పటం జరిగింది. అయితే ఇప్పుడు బాల్ ..అసిన్ కోర్టులో ఉంది. ఆమె ఈ విషయమై పోలీసులకు కంప్లైట్ ఇస్తుందా లేక లైట్ గా తీసుకుని వదిలేస్తుందా లేక అడుగు ముందుకు వేసి అతను ప్రపోజల్ ని ఏక్సెప్ట్ చేస్తుందా అనేది ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంసమైంది.

  ఆసిన్ తెలుగులో పూరి జగన్నాథ్ 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శివమణి, లక్ష్మీ నరసింహ, ఘర్షణ, చక్రం చిత్రాల్లో నటించింది. ఆమె చివరి సారిగా తెలుగులో 2006 సంవత్సరంలో వచ్చిన అన్నవరం చిత్రంలో నటించింది. అప్పటి నుంచి ఆసిన్ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. అమీర్ ఖాన్ హీరోగా రూపొందిన హిందీ గజిని చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అసిన్ ఇప్పటి వరకు 5 బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ఆమె నటించి గజనీ, రెడీ, హౌస్ ఫుల్ 2, బోల్ బచ్చన్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అవడంతో పాటు రూ. 100 కోట్లు క్రాసయ్యాయి. కిలాడీ 786 ఆమె నటిస్తున్న 6వ చిత్రం.

  'ఖిలాడి 786' లో అసిన్‌ మహారాష్ట్ర స్త్రీ అవతారంలో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో ఇందు టెండూల్కర్‌ పాత్రలో మరాఠి మగువగా కనిపించడమే కాకుండా మరాఠీ ఉచ్ఛారణతో అందరిని ఆశ్చర్యపరచింది. అక్షయ్‌ కుమార్‌, అసిన్‌ జంటగా నటించిన చిత్రం 'కిలాడీ 786'. ఆశిష్‌ ఆర్‌.మోహన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో అసిన్‌ మరాఠీ యువతి పాత్రలో దర్శనమిచ్చింది. ఇందుకోసం ఆమె ఆ భాషను నేర్చుకోవల్సి వచ్చింది. మరాఠీ నేర్చుకోవడం గురించి అసిన్‌ చెబుతూ ''అక్షయ్‌ కుమార్‌కి మరాఠీ భాష మీద మంచి పట్టు ఉంది. ఆయన బాగా మాట్లాడతారు. ఈ సినిమా కోసం నేను కూడా ఆ యాసతో కూడిన హిందీ సంభాషణల్ని పలికించేందుకు శ్రమించాను. ఈ విషయంలో అక్షయ్‌ ఎంతగానో సాయం చేశారు. ఇందులో తొలిసారిగా ఇందు టెండుల్కర్‌ అనే మరాఠి యువతి పాత్రను పోషించడం ఎంతో ఆనందంగా ఉంది. ఎంతో సరదాగా సాగిపోయే పాత్ర. కావల్సినంత వినోదం ఉంటుంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది''అని వెల్లడించింది.

  English summary
  The Khiladi 786 actor Asin is being stalked by someone. Her admirer, however, is a persistent one as he has been following her around for over six months now. Apparently, the actor was most taken aback recently when the stalker claimed that he had bought her a house in Bengaluru. “He sent her the property details and a card saying that the house was his present to her, hoping that this would convince her to marry him. Even though the matter is playing on her mind, she is choosing to ignore it as he hasn’t caused her any harm yet,” adds the source.When contacted, Asin’s spokesperson confirmed the news.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X