»   » హీరోయిన్ అసిన్ పెళ్లి తేదీ ఖరారు

హీరోయిన్ అసిన్ పెళ్లి తేదీ ఖరారు

Written By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: నటి అసిన్‌, వ్యాపారవేత్త రాహుల్‌ శర్మల నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. పెద్దలు, స్నేహితుల నడుమ వీరిద్దరూ ఒకటికానున్నారు. వీరిద్దరూ నవంబరు 26న దిల్లీలో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి వివరాలపై మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.


దిల్లీలోని ఓ హోటల్‌లో పెళ్లి జరుగుతుందని, మరునాడు వెస్ట్‌ ఎండ్‌ గ్రీన్స్‌ ఫామ్‌హౌస్‌లో సన్నిహితులకు రిసెప్షన్‌ ఏర్పాటుచేసిట్లు సమాచారం. ఇటీవల షాహిద్‌, మీరాల పెళ్లి ఈ ఫామ్‌హౌస్‌లోనే జరిగింది.

asin1


ఇంతకీ రాహుల్ శర్మ కేవలం నటుడు మాత్రమే కాదు...మైక్రోమాక్స్ కంపెనీకు కో ఫౌండర్. ఖిలాడి 786 సినిమాలో అసిన్‌ సహనటుడిగా నటించిన అక్షయ్‌కుమార్‌ తన స్నేహితుడు రాహుల్‌శర్మను అసిన్‌కు పరిచయం చేశారు. ఆ పరిచయమే వారిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది.

నటి అసిన్‌ సినీ రంగంలో పూర్తి స్థాయిలో అవకాశాలు కోల్పోవడంతో తీవ్ర ఆవేదనతో ఉంది. గతంలో 'ఎం కుమరన్‌ సన్‌ ఆఫ్‌ మహాలక్ష్మి' చిత్రం ద్వారా తమిళ తెరపైకి వచ్చి వరుస విజయాలు దక్కించుకున్న అసిన్‌ నటుడు సూర్యతో కలిసి 'గజినీ' చిత్రంలో నటించి మరింత ఉన్నత స్థాయికి చేరారు. ఘన విజయం సాధించిన ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ బాట పట్టారు.

హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో నటించి విజయకేతనం ఎగురవేశారు. ఆ తర్వాత కొన్ని చిత్రాలు వూహించిన స్థాయిలో విజయం సాధించక పోవడంతో అవకాశాలు కోల్పోయారు. చాలాకాలం తర్వాత మళ్లీ 'ఆల్‌ ఇన్‌ వెల్‌' చిత్రంలో అభిషేక్‌ బచ్చన్‌తో నటించే అవకాశం వచ్చింది.

asin2

ఇదిలా ఉండగా 'ఆల్‌ ఇన్‌ వెల్‌' చిత్రం విజయం సాధించకపోవడంతో ఆవేదనలో కూరుకుపోయింది. ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందని బావించగా నిరాశే మిగిలిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం విజయం సాధిస్తే ఆనందంగా తాను సినిరంగానికి వీడ్కోలు పలుకుతానని భావించారట. కాని ఆమె అంచనాలు తారుమారయ్యాయి.

English summary
Asin is going to tie the knot on November 26. She is marrying her long-time boyfriend Rahul Sharma. The wedding spot will be a star hotel in New Delhi.Rahul Sharma is a co-founder of the Indian mobile phone giant Micromax.
Please Wait while comments are loading...