»   » రెండు మతాల ప్రకారం హీరోయిన్ ఆసిన్ వివాహం (ఫోటోస్)

రెండు మతాల ప్రకారం హీరోయిన్ ఆసిన్ వివాహం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూఢిల్లీ: హీరోయిన్ అసిన్ వివాహం మైక్రోమాక్స్ సంస్థ సహ యజమాని రాహుల్ శర్మతో మంగళవారం గ్రాండ్‌గా జరిగింది. గత కొంత కాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఇద్దరూ వివాహంతో ఏకం అయ్యారు. వీరి వివాహం రెండు సాంప్రదాయాల ప్రకారం జరిగింది. తొలుత అసిన్ మత సాంప్రదాయం ప్రకారం రోమన్ క్యాథలిక్ పద్దతిలో చర్చిలో వివాహం జరిగింది. తర్వాత రాహుల్ శర్మ మతం ప్రకారం హిందూ వివాహ పద్దతిలో వివాహం వేరుగా జరిగింది.

తాజాగా చర్చి వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. వైట్ వెడ్డింగ్ గౌనులో ఆసిన్ అందాల దేవతలా మెరిసి పోయింది. రాహుల్ వెడ్డింగ్ సూట్లో రాజకుమారుడిలా హుందాగా కనిపించాడు. ఇద్దరూ ఒకరి చేతిని మరొకరు పట్టుకుని మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా దర్శనమిచ్చారు.

ఇక ముంబైలో ఫిల్మీ స్టైల్ లో వెడ్డింగ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు వెడ్డింగ ఇన్విటేషన్స్ అందాయి. వీరి మధ్య ప్రేమ వ్యవహారం మొదలు కావడానికి కారణం బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అనే విషయం తెలిసిందే. రాహుల్ శర్మ అక్షయ్ కుమార్ ఫ్రెండ్ కావడంతో ఆయతో పాటు నటించిన అసిన్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరూ దగ్గరయ్యాడు. వీరి లవ్ ఎఫైర్ ను అక్షయ్ కుమార్ ఎంకరేజ్ చేయడంతో ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం పెళ్లి చేసుకున్నారు. స్లైడ్ షోలో ఫోటోస్...

అసిన్-రాహుల్

అసిన్-రాహుల్

హీరోయిన్ అసిన్, రాహుల్ శర్మలకు సంబంధించిన చర్చి వెడ్డింగ్ ఫోటోను ఇక్కడ చూడొచ్చు.

ఫస్ట్ ఇన్విటేషన్

ఫస్ట్ ఇన్విటేషన్

వీరి మధ్య ప్రేమ వ్యవహారం మొదలు కావడానికి కారణం బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అనే విషయం తెలిసిందే. దీంతో అక్షయ్ కుమారే ఫస్ట్ ఇన్విటేషన్ అందుకున్నారు.

హోలట్

హోలట్

రాహుల్ శర్మ, అసిన్ చర్చి వెడ్డింగ్ జరిగిన హోటల్ వెన్యూ ఇదే..

సౌత్ మేగజైన్

సౌత్ మేగజైన్

సౌత్ మేగజైన్ కోసం రాహుల్, అసిన్ ఫోటో షూట్లో పాల్గొన్నారు.

గ్రాండ్‌గా హీరోయిన్ ఆసిన్ వివాహం (ఫోటోస్)

గ్రాండ్‌గా హీరోయిన్ ఆసిన్ వివాహం (ఫోటోస్)

వీరి వివాహం పూర్తిగా ప్రైవేట్ సెర్మనీ లాగా జరిగింది. చర్చి వెడ్డింగుకు దాదాపు 50 మంది సన్నిహితులు హాజరయ్యారు. హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే వెడ్డింగుకు దాదాపు 200 మంది హాజరు కానున్నారు.

రాహుల్ శర్మతో

రాహుల్ శర్మతో

అసిన్ వివాహం ఘనంగా జరిగింది

రాహుల్ శర్మ మైక్రోమాక్స్

రాహుల్ శర్మ మైక్రోమాక్స్

సంస్థ సహ యజమాని కావడంతో పెళ్లికి భారీగానే ఖర్చు చేసారు.

అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్ వల్ల ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది

English summary
Asin Thottumkal is marrying Rahul Sharma on 19th January! The couple is getting married in two ways, one church wedding and the other according to Hindu customs!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu