»   » ఆ యంగ్ హీరో ఇక 'పిల్ల జమిందారు'

ఆ యంగ్ హీరో ఇక 'పిల్ల జమిందారు'

Posted By:
Subscribe to Filmibeat Telugu

అష్టాచెమ్మ, భీమిలీ కబడ్డి జట్టు వంటి చిత్రాలతో పాపులర్ అయిన నాని త్వరలో "పిల్ల జమిందారు" అవతారమెత్తనున్నాడు. గతంలో ఆకాశరామన్న, ప్లాష్ న్యూస్ చిత్రాలు డైరక్ట్ చేసిన అశోక్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నాడు. ఇక ద్రోణ,కళావర్ కింగ్ చిత్రాలు నిర్మించిన డి.ఎస్.రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి గ్రామీణ ప్రాంతలో నడిచే ఈ సబ్జెక్టు వినోదాత్మకంగా ఉంటుందని చెప్తున్నారు. ఇక ఈ చిత్రానికి సెల్వ గణేషన్ సంగీతం అందిస్తున్నారు. సెల్వ గణేష్ గతంలో భీమిలీ కబడ్డి జట్టుకి సంగీతం అందించారు. ఇక "పిల్ల జమిందారు" అనే పదాన్ని జీవితాన్ని ఏ టెన్షన్స్ లేకుండా విలాసంగా గడిపే వారిని తరుచూ అంటూంటారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu