»   » అల్లు శిరీష్ - పరుశరామ్ చిత్రం టైటిల్ ఏంటి?

అల్లు శిరీష్ - పరుశరామ్ చిత్రం టైటిల్ ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదారాబాద్ : అల్లు శిరీష్, పరుశరామ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం ఈ రోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘మేరీ జాన్ ' అనే టైటిల్ ని పరిశీలుస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ టైటిల్ కు అల్లు శిరీష్, అల్లు అరవింద్ ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుకున్నారు.

మెగా కుటుంబం నుంచి మరో హీరో అల్లు శిరీష్. అల్లు అరవింద్ కుమారుడు, అల్లు అర్జున్ సోదరుడు అయిన అల్లు శిరీష్ కు తొలి చిత్రం సమయంలో మంచి క్రేజే వచ్చింది. అయితే ఆ చిత్రం డిజాస్టర్ ఫ్లాఫ్ అవటం అతన్ని ఇబ్బంది పెట్టింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

At last Sirish back with ‘Meri Jaan’

‘గౌరవం' సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన మరో హీరో అల్లు శిరీష్. ఆ తర్వాత ‘కొత్త జంట' సినిమాతో మెగా ఫ్యామిలీ హీరోల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కొత్త జంట' తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న శిరీష్, తాజాగా ఈరోజే మరో కొత్త సినిమాను మొదలుపెట్టేశారు.

‘యువత', ‘ఆంజనేయులు', ‘సోలో' సినిమాలతో మెప్పించిన పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘సారొచ్చారు' తర్వాత పరశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమా ఇదే కావటం విశేషం. రామ్ తో అనుకున్నా వర్కవుట్ కాకపోవటంతో ఇప్పుడు అల్లు శిరీష్ తో ముందుకు వెళ్తున్నారు.

ఈ ఉదయం అల్లు శిరీష్ కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఓ మంచి లవ్‌స్టోరీతో పాటు, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని శిరీష్ ఈ సందర్భంగా తెలిపారు.

English summary
Today his new film under Parusuram direction was launched. ‘Meri Jaan’ is the title under consideration for the movie and Allu Aravind himself produces this new project on Geetha Arts banner.
Please Wait while comments are loading...