twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోలైనా సరే 20 శాతం కోత విధించడమే.. టాలీవుడ్‌లో కొత్త రూల్

    |

    కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సినీ పరిశ్రమకు ఎంతటి నష్టం వాటిల్లిందో అందరికీ తెలిసిందే. సినిమా షూటింగ్‌లు లేక, రిలీజ్‌లు వాయిదా పడి, ఉపాధి కోల్పోయి కొన్ని వందల కోట్ల వ్యాపారం కుప్పకూలిపోయింది. అప్పులు తీసుకొచ్చి సినిమాలను నిర్మించిన ప్రొడ్యూసర్స్ పరిస్థితి మరి దారుణంగా తయారైంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వం థియేటర్ల పున: ప్రారంభంపై ప్రకటన వెలువడింది. దీంతో అందరిలోనూ మళ్లీ ఆశలు చిగురించాయి.

    అయితే ఇన్ని రోజుల వల్ల వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ నిర్ణయానికి వచ్చింది. రెమ్యూనరేషన్‌లో కోత విధించాలని అందరూ కలిసి నిర్ణయించారు. ఈ క్రమంలో కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నారు. ఇరవై వేల కంటే తక్కువగా రెమ్యూనరేషన్ ఉన్న ఆర్టిస్ట్‌లకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. అలాంటి వారి పేమెంట్స్‌లో ఎలాంటి కోతలు విధించబోమని తెలిపింది.

    ATFPG says That Remuneration Of Artists Cuts by 20 Percentage

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ గిల్డ్ అసోసియేషన్ కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ప్రకటించింది. లాక్ డౌన్‌కు ముందున్న అందరి రెమ్యూనరేషన్స్‌లో ఇరవై శాతం కోత విధించామని, ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరారు. సాంకేతిక నిపుణుల విషయంలో ఐదు లక్షలు తీసుకునే వారు కూడా ఇరవై శాతం తగ్గించుకోవాలని కోరింది. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాక ఈ నిబంధనల్లో మార్పులు చేసుకుందామని అంత వరకు సహకరించాని కోరారు. ఈ లెక్కన స్టార్ హీరోల రెమ్యూనరేషన్‌లో 20 శాతం కోత పడ్డట్టే.

    English summary
    Tollywood says That Remuneration Of Artists Cuts by 20 Percentage, Active Telugu Producers Guild atfpg_guild & Movie Artistes' Association have agreed on a 20% reduction on remunerations of all artistes, and technicians.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X