»   » వెన్నెల కిషోర్ ‘అతడు ఆమె ఓ స్కూటర్’ సంగతులు

వెన్నెల కిషోర్ ‘అతడు ఆమె ఓ స్కూటర్’ సంగతులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెన్నెల కిషోర్ కామెడీ హీరోగా రాణించడానికి ట్రై చేస్తున్నాడు. ఆ క్రమంలో రూపొందుతున్న చిత్రం 'అతడు ఆమె ఓ స్కూటరు'. ప్రియాంక చాబ్రా హీరోయిన్. లక్ష్మణ్ గంగారపు దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ కార్యక్రమం రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని రోజులుగా జరుగుతోంది.

ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన 2 పాటల మినహా షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.... పూర్తి వినోదాత్మ చిత్రంగా రూపొందుతున్న ఈచిత్రం ఎడిటింగ్, డబ్బింగ్ పనులు జరుపుకుంటోందని తెలిపారు. వచ్చే వారంలో మిగిలిన పాటల చిత్రీకరణ జరుపుతామని తెలిపారు.

క్రిస్ మస్ కానుకగా ఆడియో విడుదల చేస్తామని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్రయత్నిస్తామని నిర్మాత అమరేందర్ రెడ్డి తెలిపారు. తాగు బోతు రమేష్ పై చిత్రీకరించిన ప్రమోషనల్ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచయిందని తెలిపారు.

వెన్నెల కిశోర్ ఇటీవల దర్శకుడిగా ప్రయత్నించి విఫలం అయిన సంగతి తెలిసిందే. మరి హీరోగా ఏమేరకు సఫలం అవుతాడో చూడాలి. పిరమిడ్ క్రియేషన్స్ పతాకం ఈ చిత్రాన్ని జగదీష్ చంద్ర, అమరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రానికి సంగీతం: చిన్ని కృష్ణ, సినిమాటోగ్రఫీ: వికె.రాజు, దర్శకత్వం: లక్ష్మణ్ గంగారపు.

English summary
Vennela Kishore is going to play lead actor role in upcoming comedy movie titled as Athadu aame Oh scooter. Lakshaman Gangarapu will direct this movie. Jagadish Chandra, Amarendar Reddy are producing Athadu Aame Oh Scooter movie on Pyramid Creations Banner. V K Ramaraju is handling cinematography work while Chinni Krishna composes the Songs and BG Score.
Please Wait while comments are loading...