»   » పవర్ స్టార్ సునామీ... ‘అత్తారింటికి దారేది’ ఫస్ట్ డే కలెక్షన్స్

పవర్ స్టార్ సునామీ... ‘అత్తారింటికి దారేది’ ఫస్ట్ డే కలెక్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం తొలి రోజు ఏపీలో భారీ వసూళ్లు సాధించి ఆల్ టైం రికార్డ్ నెలకొల్పింది. తొలి రోజు టోటల్‌గా రూ. 11.02 కోట్ల కలెక్షన్ షేర్ లభించింది. టోటల్ షేర్ విషయంలోనే కాదు...పలు ఏరియాల్లోనూ ఆల్ టైం రికార్డు నమోదు చేసింది.

Official collections of AD

నైజాం - రూ 3.29 కోట్లు (ఆల్ టైం రికార్డ్)
(గతంలో కెమెరామెన్ గంగతో రాంబాబు రూ. 3.22 కోట్లు)

సీడెడ్ -రూ. 2.10 కోట్లు (ఆల్ టైం రికార్డు)
(గతంలో దమ్ము 2.07)

వైజాగ్- 1.09కోట్లు (ఆల్ టైం రికార్డు)
(గతంలో నాయక్ 93 లక్షలు)

వెస్ట్ - 77 లక్షలు (ఆల్ టైం రికార్డు)
(గతంలో నాయక్ 75 లక్షలు)

ఈస్ట్ - 1.05 కోట్లు(ఆల్ టైం రికార్డు)
(గతంలో బాద్ షా 98 లక్షలు)

గుంటూరు- 1.41 కోట్లు (ఆల్ టైం రికార్డు)
(గతంలో దమ్ము 1.25 కోట్లు)

కృష్ణ -71 లక్షలు (ఆల్ టైం రికార్డు)
(గతంలో కెమెరామెన్ గంగతో రాంబాబు 66 లక్షలు)

నెల్లూరు -60 లక్షలు (ఆల్ టైం రికార్డు)
(గతంలో బాద్ షా 40 లక్షలు)

టోటల్ ఫస్ట్ డే కలెక్షన్ ఏపీ షేర్ : 11.02 కోట్లు (ఆల్ టైం రికార్డ్)
(గతంలో నాయక్ : 9.49 కోట్లు)

అమెరికాలో కూడా 'అత్తారింటికి దారేది' చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రం అమెరికాలో ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమా కూడా సాధించని ఓపెనింగ్స్ సాధించింది. 'అత్తారింటికి దారేది' ప్రీమియర్ షో $424359 వసూలు చేసింది. కొన్ని రోజుల క్రితం విడుదలైన షారుక్ ఖాన్ 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రం కేవలం $260000 మాత్రమే వసూలు చేసింది. అమెరికా ఇండియన్ మూవీ బాక్సాఫీసు ట్రేడ్ నిపుణులు 'అత్తారింటికి దారేది' చిత్రం రెండో రోజు 4 నుంచి 5 లక్షల డాలర్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. వీకెండ్ పూర్తయ్యే వరకు 2 మిలియన్ల యూఎస్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్: రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Pawan Kalyan-starrer Telugu action-drama "Attarintiki Daaredhi" collected Rs. 11.02 crore in Andhra Pradesh on its opening day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu