twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమైక్య రాష్ట చరిత్రలో చివరి హిట్ ‘అత్తారింటికి దారేది’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: లోక్ సభలో తెలంగాణ బిల్లు ఆమోదంతో తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఏర్పాటు ఖాయమైన సంగతి తెలిసిందే. దీంతో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర ముగిసినట్లయింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్య మంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు రికార్డుల కెక్కగా.....సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చివరి సినిమాగా పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం చరిత్రలో నలిచిపోనుంది. రెండు రాష్టాలు ఏర్పడిన తర్వాత సీమాంధ్ర కలెక్షన్లు, తెలంగాణ కలెక్షన్లు అని మనం చెప్పుకోవాల్సి ఉంటుందేమో?

    పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం'అత్తారింటికి దారేది'. రిలీజైన రోజు నుంచి కలెక్షన్స్ దుమ్ము రేపిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్రకెక్కింది.

    అదే విధంగా బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగులు సాధించిన చిత్రంగా ఈ చిత్రం రికార్డు సృష్టించింది. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

    విడుదలకు ముందు పైరసీ...

    విడుదలకు ముందు పైరసీ...


    ‘అత్తారింటికి దారేది' చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విడుదలకు ముందు పైరసీకి గురైంది. ఈ చిత్రానికి సంబంధించిన సీడీలు బయటకు లీక్ అయ్యాయి. పరిశ్రమలో పెద్ద దురమారం రేపిన ఈ వ్యవహారంలో పోలీసులు వెంటనే నిందితులను పట్టుకున్నారు.

    అన్నింటిలోనూ టాప్

    అన్నింటిలోనూ టాప్


    పైరసీకి గురయినప్పటికీ ఈ చిత్రం ఆ పరిస్థితులను నుండి విజయవంతంగా గట్టెక్కడంతో పాటు నిర్మాతలకు అత్యధిక లాభాలు తెచ్చి పెట్టింది. శాటిలైట్ రైట్స్ విషయంలోనూ, థియేట్రికల్ రైట్స్ విషయంలోనూ, ఓవర్సీస్ వసూళ్ల విషయంలోనూ ఈచిత్రం టాప్ ప్లేస్ దక్కించుకుంది.

    నటీనటులు

    నటీనటులు


    పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు.

    టెక్నీషియన్స్

    టెక్నీషియన్స్


    ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    
 Pawan Kalyan’s ‘Atharintiki Dhaaredhi’ will likely be the last Industry Hit of Andhra Pradesh as we know it. From now on, Telugu films will create new Seemandhra records and Telangana records.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X