»   » 'అతిధి తమ్ కబ్ జావోగే?'...ఫుల్ కామిడీ(ప్రివ్యూ)

'అతిధి తమ్ కబ్ జావోగే?'...ఫుల్ కామిడీ(ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై వంటి మెట్రో నగరాల్లోని అగ్గిపెట్టెల వంటి ఇళ్ళల్లోకి హఠాత్తుగా అతిధులు వచ్చి రోజుల తరబడి తిష్ట వేస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందనే విషయాన్ని 'అతిధి తమ్ కబ్ జావోగే?' చిత్రంలో కామిడీగా చెప్తున్నారు....ఈ శుక్రవారం రిలీజవుతున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్, కొంకణాసేన్, పరేష్ రావెల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కథలో పునీత్(అజయ్ దేవగన్),మున్ మున్(కొంకణా) వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడిపే జంట. ఎక్కడో గ్రామంలో ఉండే వారి బంధువు చాచాజీ(పరేష్ రావెల్) అనుకోకుండా వీళ్ళ ఇంటికి రావటంతో ఈ యువ దంపతుల జీవితం గందరగోళంగా మారిపోతుంది. ముసలాయన్ని పంపించటానికి దంపతులిద్దరూ రకరకాల ఎత్తులు వేస్తారు. అయితే అవేమీ ఆయన సీనియారిటీ ముందు పనిచేయవు. దాంతో వారేం నిర్ణయం తీసుకున్నారు...అసలు ఆ ముసలాయిన అక్కడ రావడానికి కారణం ఏమిటన్నది మిగతా కథ. ఈ సినిమా గురించి కొంకణా మీడియాతో మాట్లాడుతూ..ఏకాంతాన్ని కోరుకునే దంపతులుకు ఇలాంటి చుట్టాలు చిరాకు తెప్పిస్తారు...డిల్లీ లాంటి నగరాల్ోల ఇల్ళు పెద్దగా ఉంటాయి.కాబట్టి సమస్య ఉండదు. అదే ముంబై లాంటి ఇరుకు ఇళ్ళల్లో బంధువులను భరించటం సాధ్యం కాదని ఆమె నవ్వేసారు..అలాగే అతిధి నవ్వించే చిత్రమే అయినా అంతర్గతంగా భావోద్వేగాలు కూడా నిండి ఉంటాయని హీరో అజయ్ చెప్పారు. ఈ చిత్రాన్ని అమితా పాఠక్ నిర్మాణంలోఅశ్వినీ ధిర్ దర్శకుడుగా రూపొందించారు. ప్రోమోలు, పోస్టర్స్ ఇప్పటికే మంచి క్రేజ్ తీసుకువస్తున్నాయి...చూద్దాం మరి ఆ అతిధి ఏ మేరకు మనల్ని అలరిస్తాడో....

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X