»   » నోట్ల రద్దు స్కైలాబ్ లాంటిదే..సెన్సార్ ఒప్పుకోలేదు.. ‘ఎటిఎం’ దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి

నోట్ల రద్దు స్కైలాబ్ లాంటిదే..సెన్సార్ ఒప్పుకోలేదు.. ‘ఎటిఎం’ దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో అభిరుచి ఉన్న దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకొన్న పీ సునీల్ కుమార్ రెడ్డి ఒకరు. మెకానికల్ ఇంజినీర్ అయిన ఆయన తొలుత జర్నలిస్టుగా అవతారం ఎత్తి వైజాగ్‌లో ది సిటీ రౌండప్ అనే పత్రికను నడిపారు. ఆ తర్వాత సినీ రంగంలొకి ప్రవేశించారు. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ఆయనను సామాజిక బాధ్యత (సోషల్ రెస్పాన్స్‌‌బిలిటీ) ఉన్న దర్శకుడిగా నిలబెట్టాయి. గంగపుత్రులు, సొంతూరు, హుదూద్, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ చిత్రాలు సామాజిక బాధ్యతను గుర్తిచేశాయి. తాజాగా నోటరద్దు, ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులు, ప్రజలపై చూపిన ప్రభావం తదితర అంశాలతో ఆయన రూపొందించిన చిత్రం ఎటిఎం వర్కింగ్. ఈ చిత్రం మార్చి 17న విడుదలవుతున్న నేపథ్యంలో www.oneindia.com, www.filmibeat.com తో ప్రత్యేకంగా మాట్లాడారు. సునీల్ కుమార్ రెడ్డి వెల్లడించిన ఏటీఎం చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే..

నోట్ల రద్దు తర్వాత పరిస్థితులపై..

నోట్ల రద్దు తర్వాత పరిస్థితులపై..

డిజిక్వెస్ట్, శ్రావ్య ఫిలింస్ రెండు బ్యానర్లపై నిర్మించిన చిత్రం ఏటీఎం నాట్ వర్కింగ్. సెన్సార్ అధికారులు ఒప్పుకోకపోవడం నాట్ అనే పదాన్ని తొలగించి చిత్ర టైటిల్‌ను ఏటీఎం వర్కింగ్ అని మార్చాను. ఇండిపెండెన్స్ తర్వాత 50 రోజులపాటు దేశ ప్రజలందరూ ప్రభావితమైన ఒకే ఒక అంశం నోట్ల రద్దు. రకరకాల ప్రజలు షేర్ చేసుకొన్న అనుభవాలకు తెరరూపమే ఏటీఎం చిత్రం.

 ముగ్గురు యువకుల కథ..

ముగ్గురు యువకుల కథ..

ఎటిఎం అంటే అనంత్, త్రిలోక్, మహేశ్ అని అర్థం. ఇంజినీరింగ్ పూర్తయిన అనే ముగ్గురు యువకుల జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలను ఏటీఎంలో చెప్పాం. ఒక సీరియస్ టాపిక్‌ను 100 నిమిషాల నిడివి ఉన్న సినిమాలో పలు అంశాలను ఉత్తేజకరంగా చెప్పడం జరిగింది.

టైటిల్‌పై సెన్సార్ అభ్యంతరం

టైటిల్‌పై సెన్సార్ అభ్యంతరం

సినిమా టైటిల్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని సెన్సార్ బోర్డు అధికారులు అభిప్రాయపడ్డారు. అందుకే అభ్యంతరం చెప్పారు. చాలా సన్నివేశాలపై కట్స్ చెప్పారు. ప్రభుత్వానికి వత్తాసు పలికే విధంగా తీసిన డాక్యుమెంటరీ లాంటి చిత్రం కాదు. మీడియాకు స్వేచ్ఛ ఉండాలి అని వాదించాను. చివరికి వాళ్లు ఒప్పుకోకపోవడంతో నాట్ అనే పదాన్ని తొలగించాల్సి వచ్చింది. కథలో ఎలాంటి మార్పులు లేవు.

టైటిల్‌ను అందుకే తొలగించా

టైటిల్‌ను అందుకే తొలగించా

తొలిసారి సినిమా టైటిల్స్‌లోని థ్యాంక్స్ కార్డులుపై కూడా అభ్యంతరం సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. టైటిల్స్ ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి జైట్లీకి థ్యాంక్స్ చెప్పడాన్ని కూడా వారు ఒప్పుకోలేదు. అందుకే ఆ టైటిల్స్ కూడా తొలిగించాం.

నోట్ల రద్దుపై సంధించిన సినీ అస్త్రం

నోట్ల రద్దుపై సంధించిన సినీ అస్త్రం

ఎటిఎం వర్కింగ్ చిత్రం పెద్ద నోట్ల రద్దు (డిమానిటైజేషన్) నేపథ్యంగా రూపొందింది. నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వ అమలు చేసిన పాలసీ సరిగా లేదు. ప్రజలందరూ అనేక ఇబ్బందులకు గురయ్యారు. బ్యాంకు ఖాతాదారులకు ఎదురైన సమస్యలను ఈ చిత్రంలో చర్చించాను. నోట్ల రద్దు తర్వాత నెలకొన్న పరిస్థితులపై విసిరిన వ్యాంగాస్త్రమే ఏటీఎం.

ఎటిఎంలో ప్రేమకథ

ఎటిఎంలో ప్రేమకథ

ఎటిఎం పక్కా లవ్ స్టోరి. ఏటీఎం క్యూలో ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమకథ. ఏటీఎం సెంటర్లను ప్రేమికులు పార్కులుగా ఉపయోగించుకొన్న సంఘటనలు గమనించాను. కేంద్రం తీసుకొన్న నిర్ణయం తర్వాత చోటుచేసుకొన్న పరిస్థితులను తెరకెక్కించాను.

ప్రభుత్వ నిర్ణయం విఫలం

ప్రభుత్వ నిర్ణయం విఫలం

ప్రభుత్వ నిర్ణయం సరైనదే కానీ దానిని అమలు చేయడంలో సరైన చర్యలు తీసుకోలేదు. స్మార్ట్‌ఫోన్ చేతులోపెట్టి క్యాష్ లెస్ విధానం అని రుద్దడం వల్ల చాలా మంది ప్రజలు మోసపోయారు. మోసపోయిన తండ్రి గురించి ఓ యువకుడు పడిన బాధ ఎటిఎం కథలో భాగం.

నోట్ల రద్దు స్కైలాబ్ లాంటిదే..

నోట్ల రద్దు స్కైలాబ్ లాంటిదే..

నోట్ల రద్దు ఉన్నట్టు ఉండి తీసుకొన్న నిర్ణయం. అయితే ప్రభుత్వం దాని తర్వాత వచ్చే సమస్యలను అంచనా వేయడంలో విఫలమైంది. కానీ ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రభుత్వ విజయం అని చెప్పడం కంటే ప్రజల విజయం అని చెప్పవచ్చు. ప్రభుత్వ తీసుకొనే ప్రతీ నిర్ణయాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు. సంయమనంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దేశ చరిత్రలో ఓ ప్రభుత్వ తీసుకొన్న అతిపెద్ద నిర్ణయంపై ప్రజలు తీవ్రంగా స్పందించలేదు. దేశవ్యాప్తంగా ఎక్కడా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకొన్న దాఖలాలు లేవు. నోట్ల రద్దు అనే అంశం గతంలో స్కైలాబ్ ఘటనలా అనిపించింది. స్కైలాబ్ పడినప్పుడు ప్రజలు తమకు తాముగా అప్రమత్తమయ్యారు. భయాందోళనకు గురయ్యారు.

 ఎటిఎం వర్కింగ్ కథ ఓ పాజిటివ్ ఆలోచన

ఎటిఎం వర్కింగ్ కథ ఓ పాజిటివ్ ఆలోచన

ఓ పాజిటివ్ ఆలోచన నుంచి పుట్టిన కథే ఏటీఎం. డబ్బు కోసం ఏటీఎం క్యూలో చనిపోయిన ఘటనలు ఆవేదన కలిగించాయి. పాలసీని అమలు చేయడంలో ప్రభుత్వ విఫలమైన తీరు, ప్రజలు ఇబ్బందులను చూపించాం.

ప్రజలకు అవగాహన కల్పించడం..

ప్రజలకు అవగాహన కల్పించడం..

ఆర్థిక వ్యవస్థ డిజిటల్ వైపు వెళ్తున్న సమయంలో సాంకేతికతపై అవగాహన లేని వారు మోసపోకూడదనే విషయాన్ని సమాజానికి చెప్పాలనే ప్రయత్నమే ఈ చిత్రం. చిత్రం చూసిన తర్వాత కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడి మనసులో కచ్చితంగా నాటుకుపోతాయి.

పరిస్థితి ఇంకా మారలేదు..

పరిస్థితి ఇంకా మారలేదు..

నోట్ల రద్దు తర్వాత ఇప్పటికీ ఎటిఎంల పరిస్థితి మారలేదు. దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఎన్నో ఎటిఎం బూజు పట్టే పరిస్థితి ఏర్పడింది. ఏటీఎంలోనూ, బ్యాంకుల్లోనూ ప్రస్తుతం క్యాష్ లేకుండా కనిపిస్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత ప్రజల ఆలోచనా తీరు కూడా మారింది. డబ్బులు అవసరానికి చేతికి వస్తుందో లేదో అనే భయంతో డబ్బును బ్యాంకుల్లో ఉంచుకోకుండా ఇంట్లో పెట్టుకొన్న సందర్భాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

సెన్సార్ గాయాలు..

సెన్సార్ గాయాలు..

మంచి కథను తెరకెక్కించే ప్రయత్నంలో సెన్సార్ బోర్డు అభ్యంతరాలతో ఈ చిత్రానికి కొన్నిగాయాలు అయ్యాయి. అయితే ప్రేక్షకులకు, సమాజానికి చెప్పాలనుకొన్న కథ, సారాంశానికి తెరపైన కనిపిస్తుంది.

 కథలపై ఆధారపడను.. సమస్యలే నా స్టోరీలు

కథలపై ఆధారపడను.. సమస్యలే నా స్టోరీలు

కథలపై నేను ఆధారపడను. సమకాలీన పరిస్థితుల్లో ఎదురైన సమస్యల ఆధారంగా సినిమాలు రూపొందిస్తా. అలా వచ్చినవే గంగపుత్రులు, సొంతూరు, మిస్ లీలావతి, ఇక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ ప్రేమ కథ. సొంతూరులో గ్రామీణ ప్రాంతంలో ఉన్న సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ (మైక్రో ఎకనామిక్స్ ) అంశాన్ని, మిస్ లీలావతిలో హుదూద్ అంశాన్ని, క్రైమ్ కథల్లో యువతీ, యువకుల ప్రవర్తన, తదితర అంశాలను ప్రస్తావించాను.

 నటీనటులు

నటీనటులు

`ఏటీఎం వ‌ర్కింగ్‌ చిత్రంలో ప‌వ‌న్‌, కారుణ్య‌, రాకేష్‌, మ‌హేంద్ర‌, నారాయ‌ణ‌, ఆషా, మ‌హేశ్‌, అంబ‌టి శీను, కిశోర్ దాస్, తిరుప‌తి దొరై, వీర‌బాబు, చిల్ల‌ర రాంబాబు, ఆంజ‌నేయులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించార. డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్‌, శ్రావ్య ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్ర‌మిది. పి.సునీల్ కుమార్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

English summary
Director P Suneel Kumar Reddy's latest movie is ATM working. This movie is releasing on March 17. In this occassion Suneel Kumar Reddy speaks to oneindia exclusively.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu