»   » రామ్ గోపాల్ వర్మ-మనోజ్ ‘అటాక్’ (ట్రైలర్ -2)

రామ్ గోపాల్ వర్మ-మనోజ్ ‘అటాక్’ (ట్రైలర్ -2)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మంచు మోహన్ బాబు, విష్ణులతో ఆ మధ్య ఓ సినిమా చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మంచు మనోజ్ తో ప్రేక్షకులపై ‘అటాక్' చేయడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా చిత్రానికి సంబంధించిన సెకండ్ ట్రైలర్ విడుదలైంది. ప్రతి సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేసే వర్మ, మనోజ్ సినిమాను కూడా తక్కువ సమయంలోనే పూర్తి చేసాడు. ‘కరెంట్ తీగ' తర్వాత మంచు మనోజ్ నటిస్తున్న సినిమా ఇదే.

 Attack Official Trailer 2

జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌, వడ్డే నవీన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా సురభిని ఎంచుకొన్నారు. ఉషాకిరణ్‌ ఫిలిమ్స్‌ చిత్రం 'బీరువా'తో తెలుగునాట అడుగుపెట్టింది సురభి. తొలి చిత్రంతోనే తన అందంతో, అభినయంతో ఆకట్టుకొంది.


ఈ చిత్రం పూర్తి యాక్షన్ తో రూపొందనుందని సమాచారం. మంచు మనోజ్ లోని యాక్షన్ కోణాన్ని పూర్తిగ వాడుతున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని దగ్గుపాటి రానా తో అనుకున్నారు...కానీ చివరి నిముషంలో సీన్ లోకి మంచు మనోజ్ వచ్చారు.


మనోజ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అది ఈ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. చాలా కాలం క్రితం హీరో గా రిటైరయ్యి తప్పుకున్న వడ్డే నవీన్ ఇప్పుడు ఈ చిత్రంతో సీన్ లోకి వచ్చారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. మంచు మనోజ్, జగపతిబాబు కాంబినేషన్ లో ఇంతకు ముందు కరెంట్ తీగ చిత్రం వచ్చింది. సికె ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీ శుభశ్వేతా ఫిలింస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది.

English summary
Watch RGVs Attack Official Trailer 2, starring Manchu Manoj, Surabhi, Jagapathi Babu, Prakash Raj and others. Music composed by Ravi Shankar.
Please Wait while comments are loading...