»   » డేంజర్ జోన్ నిర్మాతపై దాడి.. ఒకరి మృతి

డేంజర్ జోన్ నిర్మాతపై దాడి.. ఒకరి మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

డేంజర్ జోన్ సినిమా పంపిణీ హక్కుల విషయంలో చోటుచేసుకొన్న గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది.

Attack on Danger zone producer, one dead

వివరాల్లోకి వెళితే డేంజర్ జోన్ అనే కన్నడ సినిమాను రాము, స్వరూప్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వారిమధ్య ఈ చిత్రానికి సంబంధించిన టెలివిజన్ హక్కులపై వివాదం చోటుచేసుకొన్నది. ఈ నేపథ్యంలో స్వరూప్, రాముల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం స్వరూప్ తన సహచరులతో కలిసి బెంగళూరులోని స్వాగత్ క్యాంప్ లో మద్యం సేవిస్తుండగా రాము వచ్చి వారితో గొడవపడ్డారు.

Attack on Danger zone producer, one dead

అనంతరం ఫోన్ చేసి తన అనుచరులను అక్కడికి రప్పించాడు. సంఘటనా స్థలంలో వాగ్వాదం జరిగి పరిస్థితి చేజారింది. రాము అనుచరులు స్వరూప్ బృందంపై దాడి చేశారు. ఆ దాడిలో మనోజ్ అనే వ్యక్తి మృతి చెందగా సహ నిర్మాత స్వరూప్, కమల్, గోపి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడిన వారికి స్థానిక హాస్పిటల్‌లో చికిత్సనందిస్తున్నారు. పరారైన సహ నిర్మాత రాము, అతడి అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
Kannada Movie Danger Zone crew member was hacked to death by a film co-producer. Three others were injured in the attack. The incident occurred during the early hours of Friday at Someshwarnagar of Bengaluru in the city.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu