»   » సినీనిర్మాత ఆఫీస్ పై ఫైనాన్సియర్ దాడి

సినీనిర్మాత ఆఫీస్ పై ఫైనాన్సియర్ దాడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమా నిర్మాణం కోసం ఫైనాన్స్ లు తీసుకోవటం అత్యంత సహజం. అయితే ఆ ఫైనాన్స్ లు తీర్చకుండా ఎగ్గొట్టాలని ప్లాన్ చేస్తే మాత్రం వివాదాలు చెలరేగుతూంటాయి. అవి దాడులు వరకూ దారి తీస్తాయి. తాజాగా అటువంటి సంఘటన నగరంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సినిమా నిర్మాణం కోసం ఫైనాన్స్ తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించడకుండా వేధిస్తున్నారంటూ సినీనిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ కార్యాలయంలో బాధిత కుటుంబసభ్యులు దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 5లో నివాసం ఉంటున్న ప్రతాని రామకృష్ణగౌడ్ ప్రతీకార జ్వాల అనే సినిమాను నిర్మిస్తున్నానంటూ, నాగేశ్వరరావు అనే ఫైనాన్షియర్ వద్ద రూ.35లక్షల అప్పు తీసుకున్నాడు. సగం పూర్తి చేసుకున్న సినిమా మధ్యలో ఆగిపోవడంతో, తన డబ్బులు తిరిగి ఇవ్వాలని నాగేశ్వరరావు ఒత్తిడి పెంచారు.

ఎన్నిమార్లు అడిగినా పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన నాగేశ్వరరావు తనయుడు శివ, కుమార్తె మీనా ఫిలింనగర్‌లోని ఆరెంజ్ హోమ్స్ అపార్ట్‌మెంట్‌లోని రామకృష్ణగౌడ్ కార్యాలయంపై దాడిచేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. తన కార్యాలయంపై దాడి చేసిన వారిపై పోలీసులకు రామకృష్ణగౌడ్ ఫిర్యాదు చేయడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

Attack on Pratani Rama Krishna Office

ప్రపంచ సుందరి యుక్తాముఖి హీరోయిన్‌గా ఆర్‌.కె. ఫిలిమ్స్‌ పతాకంపై ప్రతాని రామకృష్ణ గౌడ్‌ నిర్మిస్తున్న చిత్రం 'ప్రతీకార జ్వాల' . 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం హైదరాబాద్‌లో కొందరు దుండగులు జరిపిన అఘాయిత్యాలకు బలయిన ఒక కుటుంబ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

తన కుటుంబానికి అన్యాయం చేసిన వారిని తన అందచందాలతో వశపరుచుకుని ప్రతీకారం తీర్చుకునే పాత్రలో యుక్తాముఖి నటించింది. తెలుగులో ఆమె నటిస్తున్న తొలి చిత్రం ఇదే. యుక్తాముఖి గ్లామర్‌తో పాటు ఆమె చేసే ఫైట్లు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. మరో హీరోయిన్‌గా సంభావన నటిస్తోంది. సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. తెలుగుతో పాటు హిందీలో కూడా ఆ సంస్థ ద్వారానే విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రానికి మాటలు: ఉదయ్‌రాజ్‌, నిర్వహణ: వంటేరు మహేందరరెడ్డి, సమర్పణ: ముషిరాబాద్‌ హర్ష, నిర్మాత: ప్రతాని రామకృష్ణ గౌడ్‌, దర్శకత్వం: సిద్దికి.

English summary
Financiar attacted on Producer Pratani Rama Krishna Office. Miss World Yukta Mukhi played the lead role in a bilingual film ‘Prateekara Jwala’. The film is getting ready for release in March. Directed by Harshat the film is produced by Pratani Ramakrishna Goud in Hindi and Telugu languages.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu