»   »  అత్తారింటికి..: ప్రెండ్స్ కోసమే (మీడియా ఎదుట పిక్చర్స్)

అత్తారింటికి..: ప్రెండ్స్ కోసమే (మీడియా ఎదుట పిక్చర్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'అత్తారింటికి దారేది' చిత్రం పైరసీ కేసును పోలీసులు కేవలం రెండు రోజుల్లోనే చేధించారు. మచిలీపట్నంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రభాకర్ రావు నిందితులను బుధవారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశ పెట్టారు. 35 మందిని విచారించిన అనంతరం మొత్తం ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐటీ యాక్టు, కాపీరైట్ యాక్టు, చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.

'అత్తారింటికి దారేది' ప్రొడక్షన్ టీంలో పని చేస్తున్న అరుణ్ కుమార్‌ను పోలీసులు ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. అతని ద్వారానే 'అత్తారింటికి దారేది' పూర్తి చిత్రం(రెండు సిడిలు) బయటకు లీకైంది. ఆ తర్వాత పలువురి చేతులు మారి ఇంటర్నెట్లోకి ఎక్కింది. అయితే ఆన్‌లైన్లో కేవలం సగ భాగం(ఒక సిడి) మాత్రమే లీక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పైరసీ వ్యవహారంలో ముగ్గురు ఎపిఎస్పీ కానిస్టేబుళ్ల హస్తం కూడా ఉండటం గమనార్హం.

స్నేహితుల కోసమే: అరుణ్‌కుమార్

కేవలం స్నేహితుల కోసమే తాను 'అత్తారింటికి దారేది' సినిమా సిడిని బయటకు ఇచ్చానని చిత్ర ఎడిటింగ్ ల్యాబ్ అసిస్టెంట్ చీకటి అరుణ్ కుమార్ తెలిపారు. అయితే, సినిమా చూడాల్సిందిగా తన స్నేహితుడైన ఎపిఎస్పీ కానిస్టేబుల్ ప్రసన్నకు సిడి ఇచ్చాను తప్పితే.. అంతకు మించి తనకెలాంటి దురుద్దేశం లేదన్నారు. స్నేహితుల ద్వారా సిడి బయటకు వెళ్లి ఇంత రాద్ధాంతం జరుగుతుందనుకోలేదన్నారు. జరిగిందింతేనని చెప్పారు.

మీడియా ముందు నిందితులు

మీడియా ముందు నిందితులు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం నిందితులను కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశ పెట్టిన దృశ్యం.

నిందితులను తీసుకు వస్తున్న పోలీసులు

నిందితులను తీసుకు వస్తున్న పోలీసులు

పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం పైరసీ నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టేందుకు తీసుకు వస్తున్న ఎస్పీ ప్రభాకర రావు, పోలీసులు.

మీడియాతో మాట్లాడుతున్న ఎస్పీ

మీడియాతో మాట్లాడుతున్న ఎస్పీ

అత్తారింటికి దారేది చిత్రం పైరసీ నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టి మాట్లాడుతున్న కృష్ణా జిల్లా ఎస్పీ ప్రభాకర రావు దృశ్యం.

నిందితులు

నిందితులు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం పైరసీ నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన కృష్ణా జిల్లా పోలీసులు.

చేతులు మారిన సిడి

చేతులు మారిన సిడి

‘అత్తారింటికి దారేది' ప్రొడక్షన్ టీంలో ఎడిటర్ అసిస్టెంటుగా పని చేస్తున్న అరుణ్ నుండి సిడి వరుసగా చేతులు మారింది. మచిలీపట్నంలో ఇంటర్నెట్లోకి అప్ లోడ్ అయింది.

English summary
Accused in Attarintiki Daredi piracy case accused produced before media today in Machilipatnam SP office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu