twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అత్తారింటికి దారేది' కి ఈ రికార్డు కూడా...

    By Srikanya
    |

    హైదరాబాద్ : చివరి నిముషంలో రామ్ చరణ్ చిత్రం ఎవడు ఫోస్ట్ ఫోన్ కావటంతో 'అత్తారింటికి దారేది' విడుదల అయ్యే థియోటర్స్ సంఖ్య ఊహించని విధంగా పెరిగిపోతోంది. ఎవడు చిత్రం దిల్ రాజు నిర్మించటంతో ఆయన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కావటంతో ఆ చిత్రానికే మాగ్జిమం థియోటర్స్ వెళ్లిపోతాయని అంతా భావించారు.

    అయితే ఇప్పుడు అంతా ఓ ఎగ్రిమెంట్ కు వచ్చి ఎవడు ని వాయిదా వేయటంతో...ప్రతీ సిటీలోనూ ఇబ్బడి ముబ్బడిగా ఈ చిత్రం ధియోటర్స్ ని బుక్ చేస్తున్నారు. దాంతో పవన్ ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు. అత్యథిక స్క్రీన్స్ వేసే చిత్రంగా అత్తారింటికి దారేది చిత్రం రికార్డ్ క్రియేట్ చేస్తుందంటున్నారు.

    ఇలా థియోటర్స్ ఎక్కువగా పెరగటంతో నిర్మాతకు సైతం చాలా కలసివస్తుంది. మొదటిరోజే కలెక్షన్స్ ఆకాశాన్ని అంటుతాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న ఈ చిత్రం ఆగస్టు 2 న సెన్సార్ జరగనుంది. పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఖచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకం అందరిలో ఉంది.

    మిగతా విశేషాలు స్లైడ్ షో లో....

    ఈ ఒక్క డైలాగుకే...

    ఈ ఒక్క డైలాగుకే...

    "చూడప్పా సిద్దప్పా... నేను సింహం లాంటివాడిని... దానికి నాకు తేడా ఒక్కటే... అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. మిగతా అంతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా" అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ఆయన అభిమానులు ఉర్రూతలూగిస్తోంది. ఈ ఒక్క డైలాగు జనాలను థియోటర్స్ దగ్గరకు లాక్కువస్తుందని చెప్తున్నారు.

    ట్రైలర్ ఇచ్చిన కిక్కే వేరు...

    ట్రైలర్ ఇచ్చిన కిక్కే వేరు...

    పవన్ నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం ఆగస్టు 7న విడుదలవుతున్న నేపథ్యంలో....నిన్న హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక వద్ద జరిగిన ఆడియో వేడుక సందర్భంగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాల మరింత పెరిగాయి.

    ఫ్యామిలీల కోసం కూడా...

    ఫ్యామిలీల కోసం కూడా...

    పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికే ‘జల్సా' చిత్రం రూపొంది మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్లో ‘అత్తారింటికి దారేది' చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందింది.

    రెండు సినిమాలనూ దాటేస్తుంది...

    రెండు సినిమాలనూ దాటేస్తుంది...

    ఖుషీ,గబ్బర్ సింగ్ ని దాటే చిత్రం అవుతుందని అభిమానులంతా ఈ చిత్రంపై నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం లో పవన్ మరింత గ్లామర్ గా కనిపించటంతో వారి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. త్రివిక్రమ్ పంచ్ లు సైతం సినిమాని ఓ రేంజికి తీసుకువెళ్తుందని ఆశిస్తున్నారు.

    వీళ్లంతా ఉండగా...

    వీళ్లంతా ఉండగా...

    ‘అత్తారింటికి దారేది' చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలో నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    Earlier Yevadu and Atarinitiki Daaredi were supposed to have close release. And both the producers tried to get maximum number of screens for their films. With no competition from Yevadu, Atharintiki Daaredi is having full advantage. The film is riding high and is having great expectations. Adding to this now it will be coming in record number of theatres. All post production work of the film has been completed and it will be censored on 2nd August. The film is produced by BVSN Prasad. Devi Sri Prasad is scoring the music. Samantha and Pranitha are heroines.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X