»   » షారుక్ ఖాన్‌ను బీట్ చేసిన పవన్ కళ్యాణ్

షారుక్ ఖాన్‌ను బీట్ చేసిన పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా...ఇది పచ్చి వాస్తవం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌ను బాక్సాఫీసులో రేసులో బీట్ చేసాడు. ప్రాంతీయ హీరో అయినప్పటికీ 'అత్తారింటికి దారేది' చిత్రంతో తన పవర్ ఏమిటో రుచి చూపించాడు.

అమెరికాలో కూడా 'అత్తారింటికి దారేది' చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రం అమెరికాలో ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమా కూడా సాధించని ఓపెనింగ్స్ సాధించింది. 'అత్తారింటికి దారేది' ప్రీమియర్ షో $424359 వసూలు చేసింది. కొన్ని రోజుల క్రితం విడుదలైన షారుక్ ఖాన్ 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రం కేవలం $260000 మాత్రమే వసూలు చేసింది.

అమెరికా ఇండియన్ మూవీ బాక్సాఫీసు ట్రేడ్ నిపుణులు 'అత్తారింటికి దారేది' చిత్రం రెండో రోజు 4 నుంచి 5 లక్షల డాలర్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. వీకెండ్ పూర్తయ్యే వరకు 2 మిలియన్ల యూఎస్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఏపీ ఫస్ట్ డే షేర్ విషయంలో 'అత్తారింటికి దారేది' సరికొత్త రికార్డు నెలకొల్పింది. తొలి రోజు రూ 10.6 కోట్ల షేర్ సాధించింది. గతంలో ఈ రికార్డు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన నాయక్ పేరు మీద ఉండేది. సంక్రాంతికి విడుదలైన నాయక్ తొలి రోజు రూ. 9.95 కోట్లు ఫస్ట్ డే ఏపీ షేర్ సాధించింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
The US premiere show collections of Attarintiki Daredi are $424k where as Shah Rukh’s Chennai Express grossed $260K only and this Power star’s stamina at box office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu