twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పంజా'లో ఈ డైలాగ్స్ కి క్లాప్స్

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్ చిత్రాల్లో ఫన్ డైలాగులకే కానీ, పవర్ ఫుల్ డైలాగులుకీ ఎప్పుడూ పెద్దగా స్ధానం లేదు. అయితే తాజా చిత్రం పంజాలో పనవ్ నోటి వెంట తొలిసారిగా పవర్ ఫుల్ డైలాగులు వింటున్న ఫ్యాన్స్ ఆనందంతో టప్పట్లు కొడుతున్నారు. ముఖ్యంగా..“తాతల చరిత్ర చెప్పుకునే అలవాటు లేదు.. మేము సృష్టించే చరిత్రలే భావి తరాలకు భగవత్ గీత..." అనే డైలాగుకి బాగా రెస్పాన్స్ వస్తోందంటున్నారు. ఇక ట్రైలర్స్ ద్వారా..“సాయిం పొందినవాడు కృతజ్ఞత చూపించపోవటం ఎంత తప్పో.. చేసినవాడు కృతజ్ఞత కోరటం అంతే తప్పు" అనే డైలాగు బాగా పాపులర్ అయ్యింది. ఆ డైలాగు పవన్ స్వయంగా రచయిత అబ్బూరి రవికి చెప్పటం జరిగిందని చెప్తున్నారు. ఇక “నా స్పీడు కు మా అన్నయ్యే అడ్డు వెయ్యలేక పోయాడు మీరు ఏంట్రా వేసేది??" డైలాగు, పవన్ వ్యక్తి గత జీవితాన్ని ప్రతిబింబిస్తే.. “మబ్బు కనపడితే వర్షం పడుతుందని ఎక్సపెక్ట్ చెయ్యచ్చు గాలి వస్తే తుఫాన్ పడుతుందని ఎక్సపెక్ట్ చెయ్యచ్చు.. కానీ నేను కొడితే బ్రతుకుతావని మాత్రం ఎక్సపెక్ట్ చెయ్యద్దు.." అనేది మంచి ఎమోషన్ తోనూ.. “చరిత్రలో అర్జునుడు శతృవుల్ని అందరికన్నా దుర్మార్గంగా చంపాడు అని నువ్వు వింటున్నట్లున్నావ్.. నేను చంపడమే చూసావంటే నీ ఒపీనియన్ మార్చు కుంటావ్.." అనే పంచ్ డైలాగులుకు ఫ్యాన్స్ కి కిక్కిస్తున్నాయని రిపోర్టు.

    కథ విషయానికి వస్తే...భగవాన్(జాకీ షరాఫ్) అనే గ్యాంగస్టర్ తల్లిని,చెల్లెలను పోగొట్టుకున్న జై(పవన్ కళ్యాణ్)కి ఆశ్రయమిస్తాడు. అక్కడే జై నమ్మకంగా పనిచేస్తూ భగవాన్ గ్యాంగ్ లో కీలకమైన వ్యక్తిగా ఎదుగుతాడు. ఇక సభాపతి(పరుచూరి వెంకటేశ్వరరావు), గురు(తణికెళ్ల) అదే గ్రూప్ లో మెంబర్స్. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో భగవాన్ కొడుకు మున్నా(అడవి శేషు)అబ్రాడ్ నుంచి వస్తాడు. అతను డ్రగ్ ఎడిక్ట్,ఉమనైజర్. ఇక జై ప్రెండ్ జాహ్నవి(అంజలి లావణ్య)తనని పట్టించుకోవటం లేదని భంగపడ్డ మున్నా ఆమెను చంపేస్తాడు. దాంతో జై అతన్ని చంపేసి కలకత్తా వదిలేసి తన గర్లెప్రెండ్ సంధ్య(సారా)నేటివ్ ప్రేస్ అయిన ఆంధ్రప్రదేస్ లోని ఓ గ్రామం కి వస్తాడు. ఇప్పుడు భగవాన్ అతనిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. అక్కడనుంచి జరిగే ట్విస్ట్ లతో సెకండాఫ్ నడుస్తుంది.

    English summary
    Pawan Kalyan starrer Panja dialogues are impressive.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X