»   » సినీ నటి కిడ్నాప్ కేసులో సూపర్ స్టార్‌కు పాత్ర.. బ్లాక్ మెయిలింగ్ ట్విస్టు

సినీ నటి కిడ్నాప్ కేసులో సూపర్ స్టార్‌కు పాత్ర.. బ్లాక్ మెయిలింగ్ ట్విస్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇక ముగిసిందనుకొన్న మలయాళ నటి భావన కేసు మరో మలుపు తిరిగింది. ఈ కిడ్నాప్ వ్యవహారంలో సూపర్ స్టార్ దిలీప్‌కు సంబంధముందనే ఆరోపణలు రావడం మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేసింది. దిలీప్‌పై మలయాళ సినీ ప్రముఖుడు, నటుడు, దర్శకుడు నాదిర్ షా చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆడియో టేప్ మీడియాలో ప్రసారం కావడంతో సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది. ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ కిడ్నాప్‌కు సంబంధించిన పలు విషయాలపై సినీ వర్గాలు కథలు కథలుగా చెప్పుకోవడం గమనార్హం.

సూపర్‌స్టార్ దిలీప్‌కు లింకు

సూపర్‌స్టార్ దిలీప్‌కు లింకు

భావన కిడ్నాప్ వ్యవహారంలో నటుడు, సూపర్‌స్టార్ దిలీప్ సన్నిహితుడు పల్సర్ సుని.. విష్ణు అనే వ్యక్తి చేత నాకు ఫోన్ చేయించాడు. నాతో ఆయన మాట్లాడుతూ.. నీ నంబర్ పట్టుకోవడానికి చాలా కష్టమైంది. కిడ్నాప్ కేసుకు సంబంధించిన వివరాలపై నీతో మాట్లాడాలి. నా ఫోన్‌లో రికార్డింగ్ సౌకర్యం లేకపోవడంతో నేనే నీకు కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆ తర్వాత రికార్డింగ్ ఫెసిలిటి ఉన్న ఫోన్‌ను సమకూర్చుకొని ఆ తర్వాత పల్సర్ సునికి నేనే ఫోన్ చేశాను అని నాదిర్ షా చెప్పాడు.

రెండు కోట్లు డిమాండ్

రెండు కోట్లు డిమాండ్

విష్ణు ఫోన్‌లో మాట్లాడేటప్పుడు చాలా ఒత్తిడిలో ఉన్నట్టు కనిపించాడు. భావన కిడ్నాప్ ఉదంతంతో చాలా మంది ప్రముఖులకు సంబంధముంది. అందులో దిలీప్ పేరు కూడా ఉంది. ఆ కేసు నుంచి తప్పిస్తే రూ.2 కోట్లు ఇస్తామని ప్రామిస్ చేశారు. తొలుత దిలీప్‌ను రూ.1.50 కోట్లు ఇవ్వాలని అడిగాలని నాకు విష్ణు సూచించాడు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే దిలీప్ పేరు చెప్పాలని సలహా ఇచ్చాడు అని నాదిర్ షా మీడియాకు వెల్లడించాడు.

నాపై ఒత్తిడి పెరుగుతున్నది

నాపై ఒత్తిడి పెరుగుతున్నది

ఫోన్ సంభాషణ సందర్భంగా మలయాళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు నాపై ఒత్తిడి తెస్తున్నారు అని విష్ణు నాతో అన్నాడు. ఆ ఆడియో టేప్‌ను, దానికి సంబంధించిన వివరాలతో కూడిన ఫిర్యాదును పోలీసులకు అందజేశాను అని నాదిర్ షా చెప్పాడు. ఓ దొంగతనం కేసులో విష్ణు జైలులో ఉన్నాడు. అదే జైలు గదిలో పల్సర్ సుని కూడా ఉన్నాడు. పల్సర్ సునీ మార్చి నెలలో విడుదలయ్యాడు.

నాదిర్ ఆరోపణలను ఖండించిన దిలీప్

నాదిర్ ఆరోపణలను ఖండించిన దిలీప్

ఇదిలా ఉండగా, నాదిర్ షా ఆరోపణలను సూపర్ స్టార్ దిలీప్ ఖండించాడు. నాదిర్ షా స్టేట్‌మెంట్ బ్లాక్ మెయిలింగ్ గురిచేసేలా ఉంది. బ్లాక్ మెయిలింగ్ చేయడానికి ఉపయోగిస్తున్న చీప్ ట్రిక్కులు. దీనికి సంబంధించిన అన్ని వివరాలను పోలీసులకు సమర్పించాం. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఈ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం నేను చాలా సీరియస్‌గా తీసుకొంటున్నాను. ఇలాంటి సమస్యలు మరొకరికి ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కొత్తగా నిందితుల స్టేట్‌మెంట్ రికార్డు

కొత్తగా నిందితుల స్టేట్‌మెంట్ రికార్డు

నాదిర్ షా ఆరోపణల నేపథ్యంలో పోలీసులు మరోసారి దర్యాప్తును వేగవంతం చేశారు. కేరళ అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి సంధ్య మలయాళ నటి నుంచి తాజాగా స్టేట్‌మెంట్ తీసుకొన్నారు. జైలులో ఉన్నప్పుడు సునీ తన సహచర ఖైదీ జిన్సెన్‌తో ఈ వ్యవహారాన్ని చర్చించాడా అని కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ ముందు జిన్సెన్ వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఫిబ్రవరిలో జరిగిన భావన కిడ్నాప్ వ్యవహారంలో జిన్సెన్‌తో పాటు మొత్తం ఆరుగురు నిందితులుగా ఉన్నారు.

ఫిబ్రవరి 17న ఘటన

ఫిబ్రవరి 17న ఘటన

ఫిబ్రవరి 17న మలయాళ నటి భావన కిడ్నాప్ గురైంది. తిరుచూర్ నుంచి కోచికి వెళ్లేటప్పుడు కిడ్నాప్ చేశారు. అనంతరం డైరక్టర్ నటుడ లాల్ ఇంటికి సమీపంలో ఆమెను వదిలేసి వెళ్లారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే...

English summary
The case of the abduction of a popular actress is turning murkier with popular Malayalam film personality, Nadir Shah, on Saturday alleging he received a call from a close aide of Pulsar Suni, the prime accused, linking superstar Dileep to the case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu