»   » ఎట్టకేలకు ‘ఆటో నగర్ సూర్య’ విడుదల ఖరారైంది

ఎట్టకేలకు ‘ఆటో నగర్ సూర్య’ విడుదల ఖరారైంది

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఆటో నగర్ సూర్య' చిత్రం ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో విడుదల చేద్దామని పలు సందర్భాల్లో నిర్మాతలు ప్రయత్నాలు చేసినప్పటికీ వివిధ రకాల ఇబ్బందులు, కోర్టు సమస్యలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

  ఎట్టకేలకు 'ఆటో నగర్ సూర్య' విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ చిత్రాన్ని జూన్ 27న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవా కట్ట దర్శకత్వం వహిస్తున్నారు. నాగ చైతన్య సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

  Auto Nagar Surya confirmed for June 27th

  ఆటో నగర్ సూర్య చిత్రాన్ని ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నాగచైతన్యని ఈ చిత్రంలో యువ నాయకుడిగా చూపించబోతున్నారు. సమాజానికి మంచి చేయాలనుకుంటే ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయనేదే సినిమా ప్రధానాంశం. 'ఏం మాయ చేశావే' వంటి హిట్ సినిమా తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటించిన సినిమా ఇదే. బ్రహ్మానందం, సాయికుమార్, జయప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, దువ్వాసి మోహన్, అజయ్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, జీవా, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ భరత్, అజయ్ ఘోష్ తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీకాంత్ నారోజ్, కూర్పు: గౌతంరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా.

  English summary
  Naga Chaitanya and Samantha’s ‘Autonagar Surya’ is back in the news once again. Now the film has been cleared from all its financial problems and has been confirmed to hit the screens on the 27th of this month. Deva Katta has directed this film and Anoop Rubens has composed the music.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more