twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఆటో నగర్ సూర్య'' ఆడియో వేడుక (ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాగచైతన్య హీరోగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియాప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'ఆటోనగర్‌ సూర్య'. సమంత హీరోయిన్. దేవాకట్టా దర్శకత్వం వహించారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చారు. పాటల విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి హైదరాబాద్‌ శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది.

    నాగచైతన్య మాట్లాడుతూ...ఈ సినిమాను ఏ సినిమాతో కంపార్ చేయలేము. ఇది ఆటో నగర్ సూర్య మాత్రమే. దేవ నాలో వేరియేషన్ చూపించాడు. నేనుఎంజాయ్ చేశాను.సమంత లిప్ లాక్ కు ఒప్పుకోలేదు. దేవా రోజు గ్రీసు ,మట్టి పట్టించేవారు. చాలా బాగుంది.మంచి అనుభవం. నిజంగా నేను నమ్మలేక పోతున్నాను.సినిమా త్వరలో విడుదల అవుతుందంటే నా కల నెరవేరనుంది త్వరలో చాలా మంది టెక్నిషియన్స్ త్యాగాలు చేసి ఈ దశకు తీసుకుని వచ్చారు.

    అభిమానులు చూపుతున్న అభిమానానికి నా ధన్యవాదాలు. వెంటనే దేవతో సినిమా చేయమంటే చేస్తాను ఈ సినిమా అతని కృషి ఉంది అనూప్ తో వరసగా మూడు సినిమాలు చేస్తున్నాను. ఇది మేము చేరుకునే మరో మెట్టు అన్నారు. 'వరుసగా పది సినిమాలు దేవాకట్టాతో చేయమంటే కళ్లు మూసుకొని పనిచేస్తాను. అంత నమ్మకాన్నిచ్చారు''అన్నారు నాగచైతన్య.

    ఆడియో పంక్షన్ విశేషాలు స్లైడ్ షోలో...

    తొలి సీడీని...

    తొలి సీడీని...

    'ఆటో నగర్ సూర్య' తొలి సీడీని... ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు విడుదల చేశారు. హీరో రానా స్వీకరించారు.

    డైలాగు పోస్టర్ ని...

    డైలాగు పోస్టర్ ని...

    ఈ కార్యక్రమంలో డైలాగ్ పోస్టర్ ను సి.కళ్యాణ్ విడుదల చేశారు. ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని అంతా భావిస్తున్నారు.

    యస్వీ కృష్ణా రెడ్డి చేతుల మీదుగా...

    యస్వీ కృష్ణా రెడ్డి చేతుల మీదుగా...

    మొదటి పాటను ప్రముఖ దర్శకుడు యస్వీ కృష్ణారెడ్డి విడుదల చేశారు... యస్వీ కృష్ణారెడ్డి కి ఆర్.ఆర్ మూవి మేకర్స్ కు మంచి అనుబంధం ఉంది. ఇదే బ్యానర్ పై ఆయన ఇంగ్లీష్ లో డైవర్స్ ఇన్విటేషన్ అనే చిత్రం చేసారు.

    రామానాయుడు మాట్లాడుతూ....

    ''నిర్మాణ విలువలు ప్రచార చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. చైతు, సమంత విజయవంతమైన కలయిక. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుంది. ఈ సినిమా ట్రైలర్స్ బాగా ఉన్నాయి.ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఈసినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా '' అన్నారు.

    సి.కళ్యాణ్ మాట్లాడుతూ....

    సి.కళ్యాణ్ మాట్లాడుతూ....

    విజయవాడలో ఆటో నగర్ కు వెళితే దడ పుడుతుంది. ఈ సినిమాలో అది ఎంతగానో చూపించి ఉంటారు. లేట్ అయిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది ఇది కూడా అలాగే సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను అన్నారు.

    రానా మాట్లాడుతూ....

    రానా మాట్లాడుతూ....

    ''ప్రచార చిత్రాలు చూసి అందరూ 'శివ' అంటున్నారు. 'ఆటోనగర్‌ సూర్య' వచ్చాక అందరూ 'శివ'ని మరిచిపోతారు. అంతలా ఉంటుందీ చిత్రం. భారతదేశంలో రికార్డులన్నీ చైతూ సినిమా దాటేయాలని కోరుకొనే వాళ్లలో నేను మొదటివాడిని. ఈ కథ నాకు ముందే తెలుసు. దేవాకట్టా బాగా తీశాడనిపిస్తోంది'' అన్నారు.

    యస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ...

    యస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ...

    ఆటోనగర్ సూర్య లో నాగ చైతన్య నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు ను ఇమిటేట్ చెయ్యలేదు. నాగ చైతన్య ఆటో నగర్ సూర్య లాగా అనిపిస్తున్నాడు. మంచి సంగీతాన్ని అనూప్ ఇస్తున్నాడు.దేవ కట్టా సినిమాను చాలా బాగా తీర్చిదిద్దాడు. సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.

    నాగచైతన్య మాట్లాడుతూ....

    నాగచైతన్య మాట్లాడుతూ....

    ''కల నిజమైంది. ఈ సినిమా కోసం భావోద్వేగంతో కూడిన ప్రయాణం చేశాం. ఈ సినిమాతో నాకెలాంటి ప్రశంసలు వచ్చినా అవి దేవాకట్టాకే చెందుతాయి. అనూప్‌ మంచి సంగీతం అందించాడు. వరుసగా అతనితో సినిమాలు చేస్తున్నాను. ఈ పాటలు, చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకం నాకుంది'' అన్నారు.

    సమంత మాట్లాడుతూ ...

    సమంత మాట్లాడుతూ ...

    ''కొన్నిసార్లు దేవుడు కష్టాలు ఇస్తాడు. అవన్నీ విజయం విలువ తెలియడానికే. దేవాకట్టా ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడు. ఈ రోజు కోసం నేను చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నా. ఈ సినిమాలో కచ్చితంగా కొత్త నాగచైతన్యని చూస్తారు'' అని చెప్పింది.

    ఈ సినిమా సైన్ చేసే ముందు ప్రస్థానం చూశాను. ఈ దర్శకుడితో పని చేయాలనుకున్నాను. ఆ సమయంలో ఆయన వచ్చి అప్రోజ్ అయ్యారు.చైతన్య గురించి నిజం చెప్పాలంటే ఏమాయ చేశావో చేశాను. ఈ సినిమాలో చైతన్య చాలా కొత్తగా కనిపిస్తాడు. డైలాగులు అన్నీ వైవిధ్యంగా ఉంటుంది.

    అనంత శ్రీరామ్ మాట్లాడుతూ...

    అనంత శ్రీరామ్ మాట్లాడుతూ...

    ఎప్పుడు విడుదలైనా కథకు కాలదోషం లేదు. దేవా కట్ట దర్శకత్వంలో పని చేయడం ఆనందం.ఆయన సన్నివేశాలు సంక్లిస్టంగా ఉంటాయి. పదాలు సంక్షప్తంగా ఉంటాయి. అనూప్ అనే ఊపు వాటికి తోడయింది కాబట్టి సినిమా పాటలు బాగా వచ్చాయి. చైతన్య, సమంతల మలి కలయికలో వస్తున్న ఈ సినిమా పాటలు కూడా అలరిస్తాయి అని నమ్ముతున్నాను అన్నారు.

    దేవాకట్టా మాట్లాడుతూ ....

    దేవాకట్టా మాట్లాడుతూ ....


    ఈ సినిమాలో ఆటో నగర్ థియేటర్ ట్రైలర్ లో మీ కింకా నా కేరక్టర్ అర్థం కాలేదు కదూ అనే డైలాగ్ ఉంది. కొందరు అపార్థం చేసుకున్నారు. ప్రపంచాన్ని ముందుకు తీసుకునే ఒక జాతి అందువల్ల అతను మోటారు కాస్ట్ అని పెట్టడం జరిగింది.

    ''చైతూ, సమంత, నిర్మాతల నమ్మకమే ఈ సినిమా. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాం. ఎక్కడా నిర్మాత రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించారు. కొద్దిగా విరామం వచ్చిన మాట నిజమే. కానీ అదేమీ గుర్తుండదు. ప్రతీ ప్రేక్షకుడి మనసుల్లోకి వెళ్లే సినిమా ఇది'' అన్నారు.

    సుకుమార్‌ మాట్లాడుతూ...

    సుకుమార్‌ మాట్లాడుతూ...

    ''నాకు బాగా నచ్చిన సినిమా 'ప్రస్థానం'. ఐదు సార్లు చూశాను. నా అభిమాన కథానాయిక సమంత. చైతన్య కళ్లల్లో నిశ్శబ్దం ఉంటుంది. అది ఇక్కడున్న ప్రతీ పోస్టర్‌లోనూ కనిపిస్తోంది. దేవ ప్రస్థానం నేను ఐదు సార్లు చూశాను. అతనికి ఇది మరో మైలు రాయి కావాలని అనుకుంటున్నాను. చైతు కళ్ళలో ఏదో గాఢత ఉంటుంది. అలాగే నా ఫేవరేట్ హీరో యిన్ సమంత కు అనూప్ కి అందరికీ ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు

    వెన్నెల కిషోర్ మాట్లాడుతూ...

    వెన్నెల కిషోర్ మాట్లాడుతూ...

    ఒకకొత్త కోణంలో చైతన్యను చూపించబోతున్నాడు. నాకు దేవ తో నాది మంచి జర్నీ ఈ సినిమాలో నాకు అవకాశం ఇవ్వలేదు. అయినా సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కావాలని కోరుకుంటున్నాను. నా జఫ్ఫా సినిమాకు అనూప్ రూబెన్స్ ఇచ్చాడు. దానికి మంచి పేరు వచ్చింది అన్నాడు.

    సాయికుమార్ మాట్లాడుతూ....

    సాయికుమార్ మాట్లాడుతూ....

    ఆటో నగర్ సూర్య తరువాత అందరూ చైతూ డైలాగుల కోసం ఎదురు చూస్తారు. దేవ కట్టా మంచి దర్శకుడు ప్రస్థానం తరువాత ఈ సినిమా దేవ చేయడం ఆనందంగా ఉంది. ఇది నా సొంత బేనర్ అన్నారు.

    శర్వానంద్ మాట్లాడుతూ...

    శర్వానంద్ మాట్లాడుతూ...


    ఈ కథ నాకు బాగా తెలుసు. ఆటోనగర్ సూర్య నాగార్జున ఫ్యాన్స్ కి వారి కుటుంబ ఫ్యాన్స్ కు ఒక పండుగ లాంటిది. దేవ చాలా బాగా చేశాడు. దేవ ఒక మంచిసోదరుడి లాంటి వాడు. నన్ను దేవ తీర్చి దిద్దినందుకే నేను ఇలా ఉన్నాను. దర్శకుడిగా ఇది అతనికి హ్యాట్రిక్ అవుతుంది అన్నారు.

    కార్యక్రమంలో ....

    కార్యక్రమంలో ....

    అచ్చిరెడ్డి,సురేష్ రెడ్డి,అనూప్ రూబెన్స్,సాయికుమార్,నాగచైతన్య, సమంత, శ్రీకాంత్, గౌతంరాజు, బి.ఏ.రాజు, కందికొండ, అనంతశ్రీరామ్,రెహమాన్, సి.కళ్యాణ్ అలంకార్ ప్రసాద్, సుశాంత్, అజయ్, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్, కట్టా నిరంజనయ్య, దేవకట్టా, మహేంద్ర, నందూ, డాక్టర్ డి.రామానాయుడు ,విజయ్ కుమార్ కోట తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Naga Chaitanya and Samantha starrer Autonagar Surya which has been in the making for long time had its music launch on Sunday night (Jan 19th) in Hyderabad. The film is directed by Deva Katta and has music by Anup Rubens. Lead pair Naga Chaitanya and Samantha graced the ceremony.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X