»   »  ‘ఆటో నగర్ సూర్య’ బిజినెస్ ఆ రేంజిలో ఉందా?

‘ఆటో నగర్ సూర్య’ బిజినెస్ ఆ రేంజిలో ఉందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యువ సామ్రాట్ నాగ చైతన్యతో 'ప్రస్థానం' ఫేం దేవా కట్టా దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత కె. అచ్చిరెడ్డి నిర్మిస్తున్న 'ఆటో నగర్ సూర్య' ట్రైలర్‌ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

ట్రైలర్ చూసినప్పటి నుంచి చైతన్య ఫ్యాన్స్ ఈ చిత్రం మంచి హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు. 'తడాఖా' వంటి కమర్షియల్ హిట్ తర్వాత వస్తున్న 'ఆటో నగర్ సూర్య' నాగ చైతన్యకు మరో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అవుతోందన్న నమ్మకం బయ్యర్లలో ఉండటం వల్ల ఈ సినిమాకి బిజినెస్ పరంగా చాలా క్రేజ్ ఏర్పడింది.

'Autonagar Surya' business details

కేవలం ఆంధ్రా ఏరియాలో 8 కోట్ల రేంజిలో వైజాగ్ ఏరియా హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు, నెల్లూరు ఏరియా హరి పిక్చర్స్ హరి తీసుకోవడంతో బిజినెస్ సర్కిల్స్‌లో ఈ సినిమాకి ఇంకా క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్ప 'ఆటో నగర్ సూర్య' ఆడియో త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

యువ సామ్రాట్ నాగ చైతన్య, సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కిమాయా, బ్రహ్మానందం, సాయి కుమార్, జయప్రకాష్ రెడ్డి, ఎంఎస్ నారాయణ, రఘుబాబు, దువ్వాసి మోహన్, అజయ్, వేణు మాధవ్, బ్రహ్మాజీ, జీవా, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ భరత్, మధు, పృథ్వీ, సమ్మెట గాంధీ, అజయ్ ఘోష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్, సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ నారాజ్, ఎడిటింగ్: గౌతం రాజు, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: రవీందర్, సమర్పణ: ఆర్.ఆర్.మూవీ మేకర్స్, నిర్మాత: కె. అచ్చిరెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: దేవా కట్టా.

English summary

 Naga Chaitanya and the gorgeously beautiful Samantha starring upcoming flick Autonagar Surya is currently in bubbing work. This movie is being directed by Deva Katta and K.Achi Reddy is the producer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu