twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రొడ్యూసర్లపై దేవాకట్ట షాకింగ్ కామెంట్స్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నాగచైతన్య హీరోగా రూపొందుతున్న ఆటో నగర్ సూర్య చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దేవాకట్ట.... తన ట్విట్టర్లో కొందరు ప్రొడ్యూసర్లు, సినీ నిర్మాణ సంస్థలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఫేక్ ప్రొడ్యూసర్లు, ప్రొడక్షన్స్ హౌస్ ల వల్ల చాలా సినిమాలు ఆలస్యంగా సాగుతున్నాయని, అనుకున్న సమయానికి సినిమాలు ప్రేక్షకుల ముందుకు తేలేక పోతున్నాయని తన ట్విట్టర్ ద్వారా విమర్శలకు దిగారు.

    సినిమా నిర్మించే శక్తి లేక పోయినా.... కొందరు అప్పులు తీసుకొచ్చి సినిమాలు మొదలు పెడుతున్నారని, ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే ఆపేస్తున్నారని, సినిమా రిలీజ్ చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నారంటూ..... తన ట్విట్టర్ పేజీలో వరుస కామెంట్లతో హోరెత్తించారు. అయితే వారెవరు అనే విషయం మాత్రం ఆయన వెల్లడించలేదు.

    ఇలాంటి ఫేక్ ప్రొడ్యూసర్ల వల్ల వారి సినిమాలకు కమిటైన దర్శకులు, హీరో హీరోయిన్లకు టైం వేస్ట్ అవుతోందని ఆయన వ్యాఖ్యల అంతరార్థంలా కనిపిస్తోంది. ఫిల్మ్ నగర్లో మాత్రం దేవా కట్ట వ్యాఖ్యలు ఆటోనగర్ సూర్య నిర్మాతల గురించే అని అంటున్నారు. ఆటో నగర్ సూర్య చిత్రం చాలా రోజుల క్రితమే ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ సమ్మర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తాం...ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది అంటున్నాడు దేవా కట్ట.

    ఆటో నగర్ సూర్య చిత్రంలో సమంత హీరోయిన్. మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్‌ నేపథ్యంలో ప్రేమ, వినోదాంశాలు కలగలిపి ఈ చిత్రం రూపొందుతోంది. సాయికుమార్‌ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.

    English summary
    Director Deva Katta, whose movie Autonagar Surya (ANS) is said be delayed due to some problems, is very upset with a few fake producers and production houses. The Indian-born-American-citizen has started a rant against such filmmakers. On his Twitter page, the director posted a series of tweets narrating how fake producers make films by taking loan and escape in the last days of its release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X