ఈ నెల్లోనే ‘ఆటోనగర్ సూర్య’...రిలీజ్ తేదీ ఫిక్స్

By Srikanya

హైదరాబాద్: నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం 'ఆటో నగర్‌ సూర్య'. దేవాకట్టా దర్శకత్వం వహించారు. ఎన్నో రోజులుగా వాయిదాలు పడుతూ,అసలు విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలు రేకిత్తించిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ నెల్లోలనే విడుదలకు సిద్దమైంది. పిభ్రవరి 27న ఈ చిత్రం విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు అఫీషియల్ గా నిర్మాతలు మీడియాకు తెలియచేసారు.

దేవకట్టా మాట్లాడుతూ... సూర్య.. విజయవాడ ఆటోనగర్‌లో చేయితిరిగిన మెకానిక్. అతడు అనాథ కానీ..అనామకుడు కాదు. అతడి ప్రపంచంలో మాటకు మాట...దెబ్బకు దెబ్బే సమాధానం. అలాంటి యువకుడు ఓ పవర్‌ఫుల్ రాజకీయనాయకుడితో ఢీ కొంటే ఎలాంటి పరిణామాలు సంభవించాయో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు . ఆర్.ఆర్.మూవీమేకర్స్ సమర్పణలో మాక్స్‌ఇండియా పతాకంపై కె. అచ్చిడ్డి నిర్మిస్తున్నారు.

నాగచైచతన్య మాట్లాడుతూ... సమాజంలో నాలుగే జాతులు ఉన్నాయి. తినేదానికన్నా ఎక్కువ పండించేవాళ్లు, కనీసం తిన్నంత పండించుకునేవాళ్లు, పండించలేక అడుక్కుతినేవాళ్లు ఉన్నారు. ఈ ముగ్గుర్ని దోచుకుతినే నాలుగో జాతి కూడా ఉంది. అదే లోఫర్‌ జాతి. అలాంటి వాళ్లమీదే 'సూర్య' ప్రతాపం చూపిస్తాడు అంటున్నారు నాగచైతన్య.

నిర్మాత మాట్లాడుతూ...''ప్రస్తుత సమాజ పరిస్థితులపై ఓ యువకుడు చేసిన పోరాటమే ఈ సినిమా. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రంలోని సంభాషణలకు మంచి స్పందన వస్తోంది '' . బ్రహ్మానందం, సాయికుమార్‌, జయప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెస్‌నారాయణ, రఘుబాబు తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: శ్రీకాంత్‌ నారోజ్‌, కూర్పు: గౌతంరాజు, కళ: రవీందర్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X