»   » అనుష్కకు తోడుగా ధియోటర్స్ కి నాగచైతన్య

అనుష్కకు తోడుగా ధియోటర్స్ కి నాగచైతన్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అనుష్క తాజా చిత్రం 'వర్ణ' . ఈ చిత్రం నవంబర్ 22న భారీ ఎత్తు విడుదల కానుంది. ఈ చిత్రంతో పాటు 'ఆటో నగర్ సూర్య' ట్రైలర్ ని ఎటాచ్ చేసి పంపనున్నారని సమాచారం. ఈ వీకెండ్ లో ఈ చిత్రం ట్రైలర్ విడుదల అవుతుంది. థియోటర్ ట్రైలర్ తో ఈ చిత్రానికి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. అందులోనూ వర్ణ సినిమాకు మంచి క్రేజ్ ఉండటంతో ఓపినింగ్స్ బాగుంటాయని..దానికి ఈ ట్రైలర్ కలిపితే వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.

ఇక నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం 'ఆటో నగర్‌ సూర్య'. దేవాకట్టా దర్శకత్వం వహించారు. మరో 20 శాతం చిత్రీకరణ మిగిలి ఉండగా ఈ సినిమా ఆగిపోయింది. దాదాపు యేడాది పాటు... ఈ సినిమాని ఎవరూ ముందుకు కదల్చలేదు. 'తడాఖా' హిట్‌ తరవాత ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. మిగిలిన చిత్రీకరణ పూర్తిచేసి ఇప్పుడు విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ''మరో వారం రోజుల చిత్రీకరణ మాత్రమే బాకీ ఉంది. త్వరలోనే ఈ సినిమాని విడుదల చేస్తున్నాం'' అని దర్శకుడు దేవాకట్టా ట్వీట్‌ చేశారు. డిసెంబరు 27 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఆడియోని నవంబర్ 23న రిలీజ్ చేస్తున్నారు. విజయవాడ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దేవకట్ట తనదైన స్టైల్లో తెరకెక్కించినట్లు సమాచారం. కె అచ్చి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

ఈ విషయమై అచ్చి రెడ్డి మాట్లాడుతూ..." కేవలం రెండు పాటలు, కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. ఒక పాటను మలేషియాలో చిత్రీకరిస్తున్నాం. దీపావళి కి ఈ సినిమాని రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. ," అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దేవాకట్ట.... తన ట్విట్టర్లో చిత్రం లేటెస్ట్ అప్ డేట్స్ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల నిర్మాణం విషయంలో అంతరాయం తలెత్తిన 'ఆటోనగర్ సూర్య' చిత్రాన్ని త్వరలోనే అన్ని పూర్తి చేసి రిలీజ్ చేస్తానని ట్విట్టర్ ద్వారా ఆయన పేర్కొన్నారు. దాదాపు ఈ చిత్రం షూటింగ్ పూర్తిగావచ్చిందని, మిగిలిన భాగాన్ని పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెస్తామని దేవా కట్టా ట్విట్టర్‌లో తెలిపారు.

ఈ చిత్రంలో స్టోరీ లైన్ ఏమిటంటే... విజయవాడలో బెంజ్‌ సర్కిల్‌ ఎంత ఫేమసో... ఆటోనగర్‌ సూర్య కూడా అంతే. తనకు తెలిసిన పని చేసుకొంటూ... ఆ రంగంలో ఎదగాలనుకొనే రకం. ఒకరి హక్కును కబ్జా చేస్తే మాత్రం ఊరుకోడు. అందుకే సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి మనస్తత్వమున్న సూర్య జీవితంలోకి ఎవరెవరు వచ్చారు? అతని ప్రయాణానికి అడ్డుగా నిలిచిన వారికి ఎలా బుద్ధిచెప్పాడు? తదితర విషయాలు 'ఆటోనగర్‌ సూర్య' చిత్రంలో చూపించబోతున్నారు.

ఆటో నగర్ సూర్య చిత్రంలో సమంత హీరోయిన్. మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్‌ నేపథ్యంలో ప్రేమ, వినోదాంశాలు కలగలిపి ఈ చిత్రం రూపొందుతోంది. సాయికుమార్‌ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.

English summary
The much-delayed Autonagar Surya is finally going to see the light of the day. The movie’s trailer will be released this weekend. PVP Cinema's Varna which is releasing on November 22nd in big way will carry the trailer. In all the movie theatres of Varna, the trailer of Autonagar Surya will also be screened.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu