»   » దిల్‌రాజు పుణ్యమే అంటున్న నాగ చైతన్య (ఫోటో ఫీచర్)

దిల్‌రాజు పుణ్యమే అంటున్న నాగ చైతన్య (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా ఆర్.ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ బ్యానర్లో దేవా కట్టా దర్శకత్వంలో అచ్చిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'ఆటో నగర్ సూర్య'. ఈ చిత్రానికి సంబంధించిన ప్లాటినమ్ డిస్క్ వేడుకు ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో జరిగింది.

గత కొంత కాలంగా విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు చొరవతో ఈ నెల 27న ఎట్టకేలకు విడుదల చేస్తున్నారు. ప్లాటినమ్ డిస్క్ వేడుక సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ ఈ సినిమా నాకు చాలా స్పెషల్, సినిమాను రిలీజ్ చేస్తున్నందుకు దిల్ రాజుకు థాంక్స్ అంటూ తన మనసులోని మాటను బయట పెట్టారు నాగ చైతన్య.

'ఆటో నగర్ సూర్య' ప్లాటినమ్ డిస్క్ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో.....

దిల్ రాజు మాట్లాడుతూ...

దిల్ రాజు మాట్లాడుతూ...

సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 27నే విడుదల చేస్తున్నాం. ఇటవలే సినిమా చూసాను. చాలా బాగా వచ్చింది. సినిమా క్లైమాక్స్ సూపర్ చాలా బాగుంది. దేవా కట్టా డైలాగ్స్, నాగ చైతన్య పెర్ఫార్మెన్స్ బాగుందని తెలిపారు.

శివ మాదిరి....

శివ మాదిరి....

నాగార్జునకి గీతాంజలి తర్వాత శివ ఎలా వచ్చిందో...అలా నాగ చైతన్యకి ఈ సినిమా అవుతుందని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

దర్శకుడు మాట్లాడుతూ..

దర్శకుడు మాట్లాడుతూ..

కాస్త ఆలస్యమైనా సినిమా విడుదల అవుతుందన్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాలో పాటలతో పాటు రీరికార్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అనూప్ మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. నా కథపై నమ్మకం ఉంచిన నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

సెన్సార్ పూర్తి

సెన్సార్ పూర్తి

ఈ చిత్రం సెన్సార్ పూర్తైంది. A(పెద్దలకు మాత్రమే) సర్టిఫేకేట్ వచ్చింది.రెండు గంటల 37 నిముషాలు..టైటిల్స్ తో కలిపి ఉండనుంది.

English summary
Naga Chaitanya, Samantha acting Auto Nagar Surya film Platinum disc function held today (26th June) at Hyderabad. Deva Katta directed the film , K Achi Reddy produced the film under RR Movie Makers banner, MAX India Production presenting the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu