»   »  'ఆవకాయ్ బిర్యానీ' టేస్ట్ గురించి...

'ఆవకాయ్ బిర్యానీ' టేస్ట్ గురించి...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Avakayi Biryani
పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ ఇది. సిక్స్‌ సీటర్‌ ఆటో డ్రైవర్‌కు, ఆవకాయ అమ్ముకునే అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథ ఇది. మనసును హత్తుకునే విధంగా ఉంటుంది. డాలర్‌ డ్రీమ్స్‌ నుంచి అనీష్‌ నాతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. తను చెప్పిన కథ నచ్చడంతో సినిమా నేనే నిర్మించడానికి ముందుకొచ్చాను అంటూ ఆవకాయ బిర్యానీ గురించి శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.

అమిగోస్‌ క్రియేషన్స్‌ ప్రై. లిమిటెడ్‌ సంస్థ పై శేఖర్‌ కమ్ముల నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల మిత్రుడు,అసోసియేట్,ఎగ్జిక్యూటీవ్ నిర్మాత అనీష్‌ కురువిల్లా దర్శకుడు. కమల్‌ కామరాజు, బింధు మాధవి ఈ చిత్రం ద్వారా హీరోహీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు.

''మొత్తం షూటింగ్‌ను వికారాబాద్‌లో చేశాం. దాదాపు అందరూ కొత్తవారే ఇందులో నటించారు. ఆహ్లాదకరమైన ప్రేమను పంచే రొమాంటిక్‌ తరహా చిత్రమిద''ని అంటూ అనీష్‌ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాను ఈనెల 10న ఆడియో విడుదల, నవంబరు ప్రథమార్ధంలో సినిమాను విడుదల చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి రావు రమేష్‌, కామేశ్వరరావు, ప్రణీత్‌, దుర్గేష్‌, వరుణ్‌ జొన్నాడ తదితరులు ఇతర పాత్రధారులు. కెమెరా: శామ్‌దత్‌, సంగీతం: మణికాంత్‌ ఖాద్రి, పాటలు: వనమాలి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బండి రత్నకుమార్‌, నిర్మాతలు: శేఖర్‌ కమ్ముల, చంద్రశేఖర్‌ కమ్ముల.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X