»   » బూతు సినిమాగా భావించొద్దని అవసరాల శ్రీనివాస్ రిక్వెస్ట్!

బూతు సినిమాగా భావించొద్దని అవసరాల శ్రీనివాస్ రిక్వెస్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అవసరాల శ్రీనివాస్, మిస్టీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోలా, శ్రీముఖి ముఖ్య పాత్రలు పాత్రల్లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టెనర్ 'బాబు బాగా బిజీ' మూవీ ఈ రోజు గ్రాండ్ గా రిలీజైంది. నవీన్ మేడారం ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, అభిషేక్ నామా నిర్మించారు. హిందీ మూవీ హంటర్ కు ఇది రీమేక్.

అయితే ఈ సినిమాపై జరుగుతున్న ప్రచారంపై ఈ చిత్ర కథానాయకుడు అవసరాల శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేసారు. దీన్ని అడల్ట్(బూతు) సినిమాగా బావించొద్దు అని అవసరాల ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసాడు.


నిజ జీవితంలో జరిగేవే

నిజ జీవితంలో జరిగేవే

అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ... ఈ సినిమాను అడల్ట్ మూవీగా భావించవద్దు, నిజ జీవితంలో జరిగే విషయాలనే ఈ సినిమాలో చూపించామన్నారు. వ్యక్తిగత జీవితాలకు దీన్ని ఆపాదించుకోవాల్సిన అవసరం లేదని, సినిమాను సినిమాలాగే చూడాలని.... మా సినిమా ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.


సినిమా కథేంటి?

మనిషికి ఆకలి, నిద్ర ఎలాగో సెక్స్ కూడా అవసరమే....అది ప్రతి మనిషికి ఫిజికల్ నీడ్ అంటూ తన స్నేహితులతో వాదించేది హీరో క్యారెక్టర్. ఇలాంటి సినిమా తెలుగులో వస్తుండటంతో చర్చనీయాంశం అయింది.


ట్రైలర్ హాట్ హాట్

ట్రైలర్ హాట్ హాట్

ఈ సినిమా ట్రైలర్ విడుదలన తర్వాత ఈ సినిమా హిందీ హంటర్ కు ఏ మాత్రం తీసి పోకుండా ఉందని తెలుస్తోంది. ట్రైలర్లో స్పైసీనెస్ ఎక్కువగా ఉండటం కూడా ఈ సినిమాపై ఇలాంటి ప్రచారం జరుగడానికి ఓ కారణం.


సినిమాపై యూత్ లో క్రేజ్

సినిమాపై యూత్ లో క్రేజ్

ఇతర వర్గాల్లో ఏమో కానీ... బాబు బాగా బిజీ సినిమాపై యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఇతర వర్గాల ప్రేక్షకుల నుండి వచ్చే స్పందనతోనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.


English summary
Srinivas Avasarala's movie 'Babu Chala Busy' released today. Babu Baga Busy movie is a romantic comedy entertainer written and directed by Naveen Medaram and produced by Abhishek Pictures while Sunil Kashyap scored the music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu