»   » అవసరాల శ్రీనివాస్ హాట్ టాపిక్: సెక్స్ అడిక్ట్‌గా..?

అవసరాల శ్రీనివాస్ హాట్ టాపిక్: సెక్స్ అడిక్ట్‌గా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'అష్టాచమ్మా' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటుడు అవసరాల శ్రీనివాస్. తర్వాత 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర చేయడం ద్వారా అటు నటుడిగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

అటు దర్శకుడిగా సినిమాలు చేస్తూ... అప్పుడప్పుడు నటుడిగానే తన సత్తా చాటుకుంటున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించే అవసరాల శ్రీనివాస్... ఇటీవల విడుదలైన 'జెంటిల్‌మన్' సినిమాలో విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు.

నటుడిగా కేవలం ఒకే రకమైన పాత్రలకే పరిమితం కాకుండా తనలోని వివిధ షేడ్స్ ను ప్రదర్శించి టాలెంటు నిరూపించుకోవాలని ఉవ్విల్లూరుతున్న అవసరాల.... ఈ సారి అడల్ట్ కామెడీ సినిమాను ఎంచుకోవడం హాట్ టాపిక్ అయింది.

ఆ మధ్య హిందీలో 'హంటర్' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. ఈ సినిమాలో అవసరాల ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో ఆయన సెక్స్ అడిక్ట్ అయిన యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. నవీన్ దర్శకుడిగా పరిచయం కానున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. హిందీలో రాధికా ఆప్టే చేసిన పాత్రలో తెలుగులో రెజీనా చేయనుందట. రెజీతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారు.

హిందీలో విడుదలైన సమయంలోనే 'హంటర్' చిత్రంలో బూతు కంటెంట్ ఎక్కువగా ఉందనే విమర్శలు వచ్చాయి. సినిమాలోని కొన్ని పచ్చి బూతు సీన్లు, సెక్స్ సీన్లు అప్పట్లో సినిమాలో నుండి సెన్సార్ బోర్డు వారు తీసేసారు కూడా. అయినప్పటకీ అందులో కంటెంట్ అసభ్యంగానే ఉందని టాక్ వచ్చింది. మరి తెలుగులో ఇలాంటి కంటెంటును రీమేక్ చేసే క్రమంలో ఏమైనా మార్పులు చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

స్లైడ్ షోలో హంటర్ సినిమాకు సంబందించిన హాట్ ఫోటోస్, హిందీ వెర్షన్ పూర్తి మూవీ...

అవసరాల శ్రీనివాస్

అవసరాల శ్రీనివాస్

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రెజీనా ప్రస్తుతం ‘జ్యో అచ్యుతానంద' చేస్తోంది. దీని తర్వాత ‘హంటర్' రీమేక్ లో అతడితోనే ఆమె తెరపై రొమాన్స్ చేయనుంది.

తెలుగులో

తెలుగులో

తెలుగు రీమేక్ లో కూడా అవసరాల శ్రీనివాస్ ఇలా చేస్తే టాలీవుడ్ ప్రేక్షకులు షాకవ్వడం ఖాయం.

రాధిక ఆప్టే పాత్రలో రెజీనా

రాధిక ఆప్టే పాత్రలో రెజీనా

రాధిక ఆప్టే చేసిన పాత్రలో రెజీనా నటించబోతోంది.

బూతు సీన్లు

బూతు సీన్లు

హిందీలో పచ్చి బూతు సీన్లు ఉండగా సెన్సార్ బోర్డు అనుమతించలేదు.

హంటర్ మూవీ

హంటర్ మూవీ హిందీ వెర్షన్ ఫుల్ మూవీ వీక్షించండి

English summary
Actor-turned-director Avasarala Srinivas, who is currently filming Nara Rohith and Naga Shaurya-starrer ‘Jo Achyutananda’, we’ve learnt, has agreed in-principle to star in the Telugu remake of Hindi film ‘Hunterrr’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu