twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అసలేం చేయబోతున్నారు!!?? ఒక్క సినిమాకు 7 వేల కోట్ల బడ్జెట్, 3డీ లో కొత్త ప్రయోగాలు ?

    జేమ్స్ కామెరూన్ అద్భుతసృష్టి అవతార్. 2009లో విడుదలైన ఈ చిత్రం గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేయడమే కాకుండా రికార్డుస్థాయి వసూళ్లను సాధించి సరికొత్త రికార్డుల్ని .

    |

    జేమ్స్ కామెరూన్ అద్భుతసృష్టి అవతార్. 2009లో విడుదలైన ఈ చిత్రం గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేయడమే కాకుండా రికార్డుస్థాయి వసూళ్లను సాధించి సరికొత్త రికార్డుల్ని సృష్టించింది. కాగా ఈ చిత్రానికి ప్రస్తుతం నాలుగు సీక్సెల్స్‌ని దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందిస్తున్నారు. వేల కోట్ల కలెక్షన్లతో ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతార్ రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు ఒకటి రెండు కాదు.. ఏకంగా నాలుగు సీక్వెల్స్ తీయడానికి దర్శక నిర్మాత జేమ్స్ కామెరూన్ సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే.

    నాలుగు సీక్వల్స్

    నాలుగు సీక్వల్స్

    గ్రహాంతర వాసుల నేపథ్యంలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రపంచ ప్రేక్షకులందరి మన్ననలు పొందింది. దీంతో 'అవతార్' సినిమాకు నాలుగు సీక్వల్స్ తీయాలని నిర్ణయించుకున్న సినిమాయూనిట్ తాజాగా మొదటి సీక్వల్ పనులు మొదలుపెట్టేసింది. ఈ సీక్వల్ కి సంబంధించిన ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు.

    2020 డిసెంబరు 18న

    2020 డిసెంబరు 18న

    ఈ సీక్వెళ్లలో మొదటిది.. 2020 డిసెంబరు 18న విడుదవుతుంది. ఈ చిత్రానికి ఏకంగా బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేస్తున్నారట. అంటే రూపాయల్లో చెప్పాలంటే ( 6539 కోట్లు) దాదాపు ఏడు వేల కోట్లన్నమాట. మరీ ఈ స్థాయిలో ఖర్చు పెట్టి ఏం సినిమా చేస్తారో చూడాలి. అవతార్-2 అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. బడ్జెట్ మీద మూణ్నాలుగు రెట్లు వసూళ్లు వస్తాయి.

    రెండు వేల కోట్లు

    రెండు వేల కోట్లు

    ఎందుకంటే అవతార్ తొలి భాగం అప్పట్లోనే ఏకంగా 2.788 బిలియన్ డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆ సినిమా బడ్జెట్ దాదాపు రెండు వేల కోట్లు. మరి రెండో భాగానికే బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారంటే అవతార్-3, 4, 5 సినిమాలకు ఎంత బడ్జెట్ పెడతారో. అవతార్-2 వచ్చిన ఏడాదికే అవతార్-3 రాబోతుండగా.. తర్వాతి రెండు భాగాలు 2024, 2025లో విడుదలవుతాయి.

    అవతార్ సినిమా తర్వాతనే

    అవతార్ సినిమా తర్వాతనే

    2009లో అవతార్ సినిమా తర్వాతనే హాలీవుడ్లో 3డి సినిమాల జోరు పెరిగింది. అయితే ఈ 3డి సినిమాలు చూడాలంటే ప్రత్యేకంగా 3డి గ్లాసులు ధరించాల్సి వస్తుంది. అయితే త్వరలో రాబోతున్న ‘అవతార్' సినిమా సీక్వెల్స్ 3డి గ్లాసుల వాడకం నుండి విముక్తి కలిగించనున్నాయి.

    3డి గ్లాసులు లేకుండానే

    3డి గ్లాసులు లేకుండానే

    అంటే 3డి గ్లాసులు లేకుండానే మనకు 3డి సినిమా చూసిన అనుభూతిని కలిగించే టెక్నాలజీని ‘అవతార్' సీక్వెల్స్ ద్వారా పరిచయం చేయబోతున్నారు. ఈ టెక్నాలజీ ప్రపంచ సినిమా రంగంలో సరికొత్త సంచలనానికి నాంది అంటున్నారు.

    English summary
    Here’s some incredibly insulting news: the budget for the Avatar sequels has broken records as the most expensive ever, coming in at a staggering $1 billion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X