twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవెంజర్: ఎండ్ గేమ్ థియేటర్లలో అపశృతి: హాస్పిటల్‌లో ఇద్దరు మహిళలు.. తప్పిన ప్రాణాలకు ముపు..

    |

    అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతున్నది. దాదాపు విడుదలైన ప్రతీ దేశంలోనూ బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్నది. అయితే ఈ సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు, పాత్రల వీడ్కోలు సీన్లు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. హృదయానికి టచ్ చేసే సీన్లు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్నాయి. అయితే పలు చోట్ల భావోద్వేగానికి గురైన ప్రేక్షకులు హాస్పిటల్‌ చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాంటి విషాద సంఘటనల గురించి వివరాల్లోకి వెళితే...

    చైనాలో సినిమా చూస్తూ ఏడ్చినందుకు

    చైనాలో సినిమా చూస్తూ ఏడ్చినందుకు

    చైనాలో 21 ఏళ్ల యువతి షియోలీ అవెంజర్స్ మూవీ చూసి హాస్పిటల్ పాలుకావడం చర్చనీయాంశమైంది. ఈ సినిమాలోని సన్నివేశాలను చూసి గుక్కపట్టి ఏడ్చిందట. దాంతో ఆమె శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారిందట. ఆమెకు ప్రాణాప్రాయ స్థితి కలుగడంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించి ఆక్సిజన్ ఎక్కించడంతో పెద్ద ముప్పు తప్పింది అని వెల్లడించారు.

    అతిగా భావోద్వేగానికి గురయ్యారు

    అతిగా భావోద్వేగానికి గురయ్యారు

    అవెంజర్స్ సినిమా చూస్తూ షియోలీ అతిగా భావోద్వేగానికి గురయ్యారు. ఎక్కువగా ఏడ్వటం వల్ల హైపర్‌వెంటిలేషన్ లక్షణాలు కనిపించాయి. ఆక్సీజన్ పెట్టిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం యువతి హాస్పిటల్‌లో కోలుకొంటుంది అని వైద్యులు తెలిపారు.

    బెంగళూరులో థియేటర్లలో తొక్కిసలాట

    బెంగళూరులో థియేటర్లలో తొక్కిసలాట

    ఇదిలా ఉండగా, బెంగుళూరులో అవెంజర్స్ సినిమా శనివారం రాత్రి 10 గంటల షో సమయంలో అపశృతి చోటు చేసుకుంది. ఇక్కడి వైట్ ఫీల్డ్‌లోని సినీ పోలిస్ ఫోరం శాంతినికేతన్ థియేటర్లో జరిగిన చిన్నపాటి తొక్కిసలాటలో 32 ఏళ్ల మహిళ గాయపడింది. రాత్రి 10 గంటల షో టైమింగ్ ఉండగా.... 9.57 నిమిషాలకు డోర్స్ ఓపెన్ చేశారు. దీంతో సినిమా మిస్సవుతామనే కంగారులో ఒక్కసారిగా జనం తోసుకుంటూ లోనికి ప్రవేశించారు. దీంతో ఓ మహిళ క్రింద పోవడంతో ఆమెను తొక్కేసుకుంటూ వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఆమె మొహానికి గాయమైంది.

    2 బిలియన్ డాలర్ల క్లబ్ వైపుగా

    2 బిలియన్ డాలర్ల క్లబ్ వైపుగా

    మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన 'అవెంజర్స్: ది ఎండ్ గేమ్' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ కలెక్షన్ 1.2 బిలియన్ డాలర్లు(రూ.8381 కోట్లు) వసూలు చేసింది. మరో రెండువారాల్లో 2 బిలియన్ డాలర్ మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

    ఏకంగా 46 దేశాల్లో కలెక్షన్ల సునామీ

    ఏకంగా 46 దేశాల్లో కలెక్షన్ల సునామీ

    కాగా, అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం సుమారు 46 దేశాల్లో విడుదలైంది. విడుదలైన ప్రతీ దేశంలో కూడా ఆదేశానికి సంబంధించిన అత్యుత్తమ వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నది. ప్రతీచోటా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శింపబడుతున్నది.

    English summary
    Avengers: Endgame, the final part of the superhero series, has so many emotional moments that people are becoming teary-eyed while watching it. But a strange incident happened in China a few days ago when a 21-year-old girl Xiaoli got hospitalised as she could not stop crying during the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X